ప్రాసలతో ఫైర్‌ అయిన చెవిరెడ్డి

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో డీజీపీ ఉంటే చాలు అన్నట్టుగా చంద్రబాబు తీరు తయారైందని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి విమర్శించారు. ఓటుకు నోటు నుంచి రక్షించేందుకు బీజేపీ, ప్రశ్నించిన వారిని లోపలేసేందుకు డీజీపీ ఉంటే చాలు అని చంద్రబాబు ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసు, సూట్‌కేసు, లోకేష్‌… ఈ మూడింటి మధ్యే చంద్రబాబు రాజకీయం నడుస్తోందన్నారు. కేసులనుంచి తప్పించుకోవడం, సూట్ కేసులు నింపుకోవడం వాటిని తీసుకొని లోకేష్ కి ఇవ్వడం ఇదే చంద్రబాబుకు పనిగా మారిందని విమర్శించారు. అసెంబ్లీలో […]

Advertisement
Update:2016-09-12 12:27 IST

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో డీజీపీ ఉంటే చాలు అన్నట్టుగా చంద్రబాబు తీరు తయారైందని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి విమర్శించారు. ఓటుకు నోటు నుంచి రక్షించేందుకు బీజేపీ, ప్రశ్నించిన వారిని లోపలేసేందుకు డీజీపీ ఉంటే చాలు అని చంద్రబాబు ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసు, సూట్‌కేసు, లోకేష్‌… ఈ మూడింటి మధ్యే చంద్రబాబు రాజకీయం నడుస్తోందన్నారు. కేసులనుంచి తప్పించుకోవడం, సూట్ కేసులు నింపుకోవడం వాటిని తీసుకొని లోకేష్ కి ఇవ్వడం ఇదే చంద్రబాబుకు పనిగా మారిందని విమర్శించారు. అసెంబ్లీలో స్పీకర్‌పై తాము దాడి చేశామంటూ యనమల రామకృష్ణుడు చెప్పడం సిగ్గుచేటన్నారు. 37ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న యనమల జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. సెక్రటరీ మెడకు వైర్ చుట్టు చంపేందుకు వైసీపీ సభ్యులు ప్రయత్నించారంటున్న యనమల అసలు తలకాయ ఉండే మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. సెక్రటరిపై దాడి చేయాల్సిన అవసరం తమకేముంటుందని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు చివరిసారి అసెంబ్లీ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వని వ్యక్తి యనమల రామకృష్ణుడు అని గుర్తు చేశారు. ఆఖర్లో అసెంబ్లీ నుంచి ఎన్టీఆర్ వెళ్తుంటే టపాసులు కాల్చిన వ్యక్తులు ఇప్పుడు స్పీకర్‌ చైర్‌ గురించి మాట్లాడం ఆశ్చర్యంగా ఉందన్నారు. నిరసన తెలిపేందుకు పోడియం వద్దకు వెళ్లడం పార్లమెంట్‌లో కూడా జరుగుతోందన్నారు. స్పీకర్‌తో యనమల రామకృష్ణుడికి అంతర్గత విబేధాలు ఉన్నాయన్న అనుమానం కలుగుతోందన్నారు.

Click on Image to Read:

 

 

 

Tags:    
Advertisement

Similar News