కేసులు ఆమ్‌ ఆద్మీపై... పరువుపోతున్నది బీజేపీకి...

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక బహుశా ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంతగా వెంటాడి, వేధించి ఉండదేమో..! ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత బీజేపీ ఆమ్‌ ఆద్మీ పార్టీకి చుక్కలు చూపిస్తున్నది. కేజ్రీవాల్‌ కూడా మరీ ముక్కుసూటిగా వ్యవహరించి అన్ని రాజకీయ పార్టీలకు శత్రువుగా మారాక ఆయన పార్టీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదు అవుతుంటే తిక్క కుదిరింది అన్న రీతిలో పెద్దగా సానుభూతి వ్యక్తం కాలేదు. అయితే సిల్లీ రిజన్స్‌తో ఆమ్‌ ఆద్మీ ఎమ్మెల్యేల మీద […]

Advertisement
Update:2016-09-12 10:26 IST

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక బహుశా ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంతగా వెంటాడి, వేధించి ఉండదేమో..! ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత బీజేపీ ఆమ్‌ ఆద్మీ పార్టీకి చుక్కలు చూపిస్తున్నది. కేజ్రీవాల్‌ కూడా మరీ ముక్కుసూటిగా వ్యవహరించి అన్ని రాజకీయ పార్టీలకు శత్రువుగా మారాక ఆయన పార్టీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదు అవుతుంటే తిక్క కుదిరింది అన్న రీతిలో పెద్దగా సానుభూతి వ్యక్తం కాలేదు.

అయితే సిల్లీ రిజన్స్‌తో ఆమ్‌ ఆద్మీ ఎమ్మెల్యేల మీద రోజుకు ఒక కేసు రిజిష్టర్‌ అవుతుంటే జనం నివ్వెరపోతున్నారు. భారతీయ శిక్షాస్మృతిని అవహేళన చేస్తూ ఢిల్లీ పోలీసులు ఆమ్‌ ఆద్మీ ఎమ్మెల్యేలపై పెడుతున్న కేసులు భారత పౌరుల్లో బీజేపీ కక్ష సాధింపు ధోరణిపట్ల భయాన్ని, ఆమ్‌ ఆద్మీ పార్టీ పట్ల సానుభూతిని కలిగిస్తున్నాయి.

డిగ్రీ సర్టిఫికేట్‌ విషయంలో ఒక ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. అలాంటి ఆరోపణలే ఎదుర్కొంటున్న స్మృతి ఇరానీని పట్టించుకోలేదు. ప్రధాని నరేంద్ర మోడీ అయితే తన విద్యార్హతల విషయంలో చాలా చెడ్డపేరు తెచ్చుకున్నారు. మోడీ పేరుతో చూపిన డిగ్రీ సర్టిఫికేట్‌ ప్రధాని మోడీది కాదని ఆ డిగ్రీ సర్టిఫికేట్‌ ఓనర్‌ వేరే మోడీని మీడియా దేశ ప్రజలకు చూపించింది.

ఎవరో మత కలహాలలో పాల్గొంటే పాల్గొన్న వాళ్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఉపన్యాసాలవల్ల ప్రభావితమయ్యారని అందువల్ల ఆ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే పై కేసు నమోదు చేశారు పోలీసులు.

మరో సంఘటనలో ఎవరో ఒక స్త్రీ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఇంటికి వచ్చి మా ఇంటికి విద్యుత్‌ సరఫరా సరిగా లేదు అని గట్టిగా అరుస్తుంటే బయట నిలబడ ఒక వ్యక్తి ఆమెను బెదిరించాడని, ఆమె తిరిగి ఇంటికి వెళుతుంటే ఆ బెదిరించిన వ్యక్తి కారు నడుపుతూ తనను చంపబోయాడని, అదే కారులో ఆ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కూర్చొని ఉన్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదుచేస్తే ఆ ఎమ్మెల్యే మీద కేసు రిజిష్టర్‌ చేశారు ఢిల్లీ పోలీసులు.

గత వారంలో ఒక ఇంట్లో గొడవ జరిగింది. ఒక స్త్రీ తనను భర్త హింసిస్తున్నాడని, అత్తమామలు కట్నం కోసం ఎప్పటినుంచో వేధిస్తున్నారని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వేధింపులతోపాటు తన భర్త తనను ఒక ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేతో శారీరక సంబంధం ఏర్పరచుకోమని సాధిస్తున్నాడని కేసు పెట్టింది. వెంటనే పోలీసులు ఆ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే పై కేసు రిజిష్టర్‌ చేశారు.

గత శనివారంనాడు ఢిల్లీలో ఒక గుంపు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించింది. ఆ గుంపు అలా ప్రవర్తించడానికి, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడానికి కారణం ఆప్‌ ఎమ్మెల్యే సోమ్‌నాధ్‌ భారతి, అతని అనుచరులు ప్రోత్సహించడం వల్లనేనని ఢిల్లీ పోలీసులు సోమ్‌నాధ్‌ భారతి పై, అతని అనుచరులపై కేసు నమోదు చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఢిల్లీ పోలీసులు ఆమ్‌ ఆద్మీ పార్టీని వేధిస్తున్నారా? బీజేపీ పరువు తీస్తున్నారా? అర్ధం కావడం లేదు.

Click on Image to Read:

 

 

 

Tags:    
Advertisement

Similar News