వైసీపీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్, అదుపులో సీపీఎం నేతలు

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్ ఫార్మాఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం ఉదృతమవుతోంది. మంగళవారం దివీస్ భూసేకరణకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమవగా పోలీసులు అడ్డుకున్నారు. సభకు వచ్చే వారిని ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేస్తున్నారు. వైసీపీ తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను హౌజ్ అరెస్ట్ చేశారు. పలువురు సీపీఎం నేతలను అదుపులోకి తీసుకున్నారు. బహిరంగసభను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం పంపాదిపేట, తాటాకుపాలెం, కొత్తపాకుల గ్రామాల్లో భారీగా పోలీసులను మోహరించింది. ఒక్కో గ్రామంలో సుమారు […]

Advertisement
Update:2016-09-06 04:29 IST

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్ ఫార్మాఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం ఉదృతమవుతోంది. మంగళవారం దివీస్ భూసేకరణకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమవగా పోలీసులు అడ్డుకున్నారు. సభకు వచ్చే వారిని ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేస్తున్నారు. వైసీపీ తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను హౌజ్ అరెస్ట్ చేశారు. పలువురు సీపీఎం నేతలను అదుపులోకి తీసుకున్నారు. బహిరంగసభను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం పంపాదిపేట, తాటాకుపాలెం, కొత్తపాకుల గ్రామాల్లో భారీగా పోలీసులను మోహరించింది. ఒక్కో గ్రామంలో సుమారు 300 మంది పోలీసులను దింపారు. తొండంగి మండలంలోని పంపాదిపేట, కొత్తపాకల, తాటాకులపాలెం గ్రామాల పరిధిలో దివీస్‌ ఫార్మా ఫ్యాక్టరీ నిర్మాణానికి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మూడు గ్రామాల్లో 400 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇందుకు స్థానిక ప్రజలు అంగీకరించడం లేదు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. తమ నోట్లో మట్టికొట్టి దివీస్‌కు భూములు అప్పగించేందుకు మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News