ప్రియాంకా చోప్రా అలా చేసిందా?

దేశంలో జియో సిమ్‌ల కోసం జ‌నం పోటీప‌డుతున్నారు. ఉచిత డేటా, కాల్స్ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించి ఒక్క‌సారిగా అంద‌రి దృష్టి త‌న‌వైపు తిప్పుకుంది. కొన్ని రిల‌య‌న్స్ రీటెయిల‌ర్ల ముందు జ‌నం రాత్రి ప‌గ‌లు తేడా లేకుండా ప‌డిగాపులు కాస్తున్నారు. సాధార‌ణ  జ‌నాలు ఈ సిమ్‌ల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారంటే అందులో విశేష‌మేమీ ఉండ‌దు. కానీ, బాలీవుడ్ అగ్ర‌శ్రేణి హీరోయిన్ ప్రియాంకా చోప్రా కూడా జియో సిమ్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌న్న వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. […]

Advertisement
Update:2016-09-06 05:06 IST
దేశంలో జియో సిమ్‌ల కోసం జ‌నం పోటీప‌డుతున్నారు. ఉచిత డేటా, కాల్స్ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించి ఒక్క‌సారిగా అంద‌రి దృష్టి త‌న‌వైపు తిప్పుకుంది. కొన్ని రిల‌య‌న్స్ రీటెయిల‌ర్ల ముందు జ‌నం రాత్రి ప‌గ‌లు తేడా లేకుండా ప‌డిగాపులు కాస్తున్నారు. సాధార‌ణ జ‌నాలు ఈ సిమ్‌ల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారంటే అందులో విశేష‌మేమీ ఉండ‌దు. కానీ, బాలీవుడ్ అగ్ర‌శ్రేణి హీరోయిన్ ప్రియాంకా చోప్రా కూడా జియో సిమ్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌న్న వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ప్రియాంక‌ఫొటోతో కూడిన జియో ద‌ర‌ఖాస్తు ఒక‌టి ఇప్పుడు నెట్లో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఈ ద‌ర‌ఖాస్తులో ప్రియాంక చోప్రా చిరునామాతో స‌హా.. చిరునామా కూడా స‌రిగ్గానే ఉన్నాయి. కానీ సంత‌కం వ‌ద్దే తేడా కనిపిస్తోంది. ఇదెవ‌రో ఆక‌తాయిలు చేసిన ప‌ని ఉంటుంద‌ని కొంద‌రు భావిస్తున్నారు. ఎందుకంటే.. టెలికం కంపెనీలేవీ ఖాతాదారుల వ్య‌క్తిగ‌త వివ‌రాలేవీ లీక్ చేయ‌వు. కాబ‌ట్టి ఇది కావాలిన చేసిన ప‌నేన‌ని అనుకుంటున్నారంతా!

Click to Read

అపరిచితుడికి ఇ‍ంకొకడి ద్వారా హిట్ కొడతాడా ?
Tags:    
Advertisement

Similar News