బాబుకు జగన్ తాట తీయబోతున్నారు.. లోపల భోజనం పెట్టి కూర్చోబెట్టారు- చెవిరెడ్డి

ఓటుకు నోటు కేసు నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం కోసమే తుని విధ్వంసం కేసులో భూమన కరుణాకర్‌ రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసిందని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. గుంటూరులో భూమన కరుణాకర్‌ రెడ్డిని సీఐడీ విచారిస్తున్న కార్యాలయానికి చెవిరెడ్డి, అంబటి రాంబాబు కూడా వచ్చారు. ఈ సందర్భంగా ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడిన చెవిరెడ్డి… భూమన కరుణాకర్‌ రెడ్డికి తుని ఘటనకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఒక తప్పు చేయడం ఆ తప్పు […]

Advertisement
Update:2016-09-06 09:56 IST

ఓటుకు నోటు కేసు నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం కోసమే తుని విధ్వంసం కేసులో భూమన కరుణాకర్‌ రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసిందని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. గుంటూరులో భూమన కరుణాకర్‌ రెడ్డిని సీఐడీ విచారిస్తున్న కార్యాలయానికి చెవిరెడ్డి, అంబటి రాంబాబు కూడా వచ్చారు. ఈ సందర్భంగా ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడిన చెవిరెడ్డి… భూమన కరుణాకర్‌ రెడ్డికి తుని ఘటనకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఒక తప్పు చేయడం ఆ తప్పు నుంచి జనం దృష్టి మళ్ళించేందుకు మరో తప్పు చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు.

కాపులకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా వైసీపీ నేతలపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. భూమనను అడ్డుపెట్టుకుని అసెంబ్లీలో ఓటుకు నోటు కేసుపై చర్చ నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. కానీ అలాంటి పప్పులేమీ ఉడకవని అసెంబ్లీలో చంద్రబాబు తాటను జగన్‌ తీయబోతున్నారని చెవిరెడ్డి అన్నారు. అసలు భూమన కరుణాకర్‌ రెడ్డిని అడిగేందుకు ప్రశ్నలు లేక ఉదయం నుంచి కార్యాలయంలో ఖాళీగా కూర్చోబెట్టి మధ్యమధ్యలో కాఫీలు, టీలు, భోజనం పెడుతున్నారని చెవిరెడ్డి చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించామని చెప్పుకుని పత్రికల్లో రాయించుకునేందుకే ఇలా చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. అసెంబ్లీలో చంద్రబాబును నిలదీస్తామన్నారు. ముద్రగడతో భూమనకు వ్యక్తిగత పరిచయాలు 30, 40 ఏళ్ల నుంచే ఉన్నాయన్నారు చెవిరెడ్డి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News