వారిది పాము, కప్ప సంబంధం... భూమనను అరెస్ట్ చేస్తారా?

తుని ఘటనలో తొలిరోజు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని సీఐడీ సుధీర్గంగా విచారించింది. దాదాపు ఏడు గంటల పాటు కార్యాయలంలోనే ఉంచుకున్నారు.. తుని ఘటనపై పలు ప్రశ్నలు ఆయనను ఆడిగారు. తుని ఘటనకు సంబంధించి ఫొటోలను చూపించి వివరాలు అడినట్టు తెలుస్తోంది. ముద్రగడతో సంబంధాలపైనా ప్రశ్నించారు. అయితే ఎక్కువ సమయంలో భూమనను ఖాళీగా కూర్చోబెట్టినట్టు చెవిరెడ్డి చెప్పారు. కేవలం సుధీర్ఘంగా విచారించామని చెప్పుకునేందుకే, అడిగేందుకు ప్రశ్నలు లేకున్నా భూమనను కార్యాలయంలో కూర్చోబెట్టుకున్నారని వెల్లడించారు. అయితే తొలిరోజు […]

Advertisement
Update:2016-09-06 15:39 IST

తుని ఘటనలో తొలిరోజు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని సీఐడీ సుధీర్గంగా విచారించింది. దాదాపు ఏడు గంటల పాటు కార్యాయలంలోనే ఉంచుకున్నారు.. తుని ఘటనపై పలు ప్రశ్నలు ఆయనను ఆడిగారు. తుని ఘటనకు సంబంధించి ఫొటోలను చూపించి వివరాలు అడినట్టు తెలుస్తోంది. ముద్రగడతో సంబంధాలపైనా ప్రశ్నించారు. అయితే ఎక్కువ సమయంలో భూమనను ఖాళీగా కూర్చోబెట్టినట్టు చెవిరెడ్డి చెప్పారు. కేవలం సుధీర్ఘంగా విచారించామని చెప్పుకునేందుకే, అడిగేందుకు ప్రశ్నలు లేకున్నా భూమనను కార్యాలయంలో కూర్చోబెట్టుకున్నారని వెల్లడించారు.

అయితే తొలిరోజు విచారణ ముగిసిందని చెప్పిన సీఐడీ అధికారులు… బుధవారం మరోసారి తమ ముందు హాజరుకావాలని ఆదేశించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్ రెడ్డి..చంద్రబాబు రూథర్‌ఫర్డ్‌లా తయారయ్యారని విమర్శించారు. గతంలో రూథర్‌ఫర్డ్ గిరిజనులను ఏరివేసినట్టు ఇప్పుడు కాపులను చంద్రబాబు ఏరివేసే ప్రయత్నంలో ఉన్నారని విమర్శించారు. తుని ఘటనలో ఎలాంటి సంబంధం లేని తనకు సీఐడీ నోటీసులు జారీ చేయడం చంద్రబాబు దాష్టికానికి పరాకాష్ట అన్నారు. కేవలం జగన్‌ను బదనాం చేసేందుకు చంద్రబాబు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు, కాపుల మధ్య సంబంధం పాము కప్పలాంటిదన్నారు. కప్పను మింగేందుకు పాము కాచుకున్నట్టుగా కాపులను దెబ్బతీసేందుకు చంద్రబాబు కాచుకున్నారని ఆరోపించారు. అయితే భూమనను మరోసారి సీఐడీ అధికారులు విచారణకు రావాల్సిందిగా ఆదేశించడం ఆసక్తిగా ఉంది. భూమనతో పాటు నోటీసులు అందుకున్న 19మంది రాజమండ్రిలో నాలుగో తేది సీఐడీ ముందు హాజరయ్యారు. భూమనను మాత్రం రెండో రోజు విచారణకు రావాల్సిందిగా ఆదేశించడం చర్చనీయాంశమైంది. తుని ఘటనలో వైసీపీని ప్రధాన దోషిగా నిలబెట్టేందుకు తొలి నుంచి ప్రయత్నిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం బహుశా భూమనను అరెస్ట్ చేస్తుందా? అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. రెండో రోజు కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశించడం కూడా అందుకు బలాన్ని చేకూరుస్తోందంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో?.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News