వర్మ దారి తప్పాడా?... సమాజమే దారి తప్పిందా?

టీచర్స్ డే రోజు కూడా రామ్‌గోపాల్ వర్మ డిఫరెంట్‌గానే స్పందించారు. తనకు టీచర్స్ అంటే ఇష్టముండదని చెప్పారు. టీచర్ల నుంచి తానేది నేర్చుకోలేదని చెప్పారు. మీరు కూడా స్కూల్లో టీచర్లతో సమయం వేస్ట్ చేసుకోవద్దని సలహా ఇచ్చారు. కావాలంటే గూగూల్ నుంచే అంతా నేర్చుకోవాలని సూచించారు. తాను టీచర్లను ద్వేషించేవాడినని, క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు చూసేవాడినని చెప్పారు. అందుకే ఈ రోజు తాను దర్శకుడిని అయ్యానన్నారు. తనకు చదువు చెప్పిన టీచర్ల కంటే తనకే ఎక్కువ తెలుసని […]

Advertisement
Update:2016-09-05 13:34 IST

టీచర్స్ డే రోజు కూడా రామ్‌గోపాల్ వర్మ డిఫరెంట్‌గానే స్పందించారు. తనకు టీచర్స్ అంటే ఇష్టముండదని చెప్పారు. టీచర్ల నుంచి తానేది నేర్చుకోలేదని చెప్పారు. మీరు కూడా స్కూల్లో టీచర్లతో సమయం వేస్ట్ చేసుకోవద్దని సలహా ఇచ్చారు. కావాలంటే గూగూల్ నుంచే అంతా నేర్చుకోవాలని సూచించారు. తాను టీచర్లను ద్వేషించేవాడినని, క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు చూసేవాడినని చెప్పారు. అందుకే ఈ రోజు తాను దర్శకుడిని అయ్యానన్నారు. తనకు చదువు చెప్పిన టీచర్ల కంటే తనకే ఎక్కువ తెలుసని ట్వీట్ చేశారు. తన టీచర్లందరికంటే తానే ఎక్కువ విజయాలు సాధించానని, దాన్నిబట్టి తనకు తన టీచర్లందరికంటే ఎక్కువ తెలుసని అర్థమవుతోందని రాంగోపాల్ వర్మ అన్నాడు.

క్లాసుల్లో టీచర్ల ద్వారా కంటే గొడవల నుంచే ఎక్కువగా నేర్చుకున్నానన్నారు. వాటి అనుభవాలతోనే శివ, సత్య లాంటి సినిమాలు తీశానన్నారు. క్లాసులో కామిక్ పుస్తకాలు చదవకుండా అడ్డుకుంటారని అందుకే టీచర్లంటే తనకు ద్వేషమన్నారు. కొందరు టీచర్లు బలవంతంగా క్లాస్‌లో కూర్చొబెట్టి పుస్తకాలు చదివించేవారని… తన జీవితంలో అవే అత్యంత దారుణమైన రోజులని వర్మ చెప్పారు. ప్రతిరోజూ స్కూల్లో పాఠాలు అయిపోయిన తర్వాత వాటిని మర్చిపోవడానికి కామిక్ పుస్తకాలు, ఫిక్షన్ నవలలు చదివేవాడినని చెప్పారు వర్మ. తనకు టీచర్స్ అంటే ఇష్టముండదు గానీ… టీచర్స్ విష్కీ మాత్రం చాలా ఇష్టమని వర్మ చెప్పుకొచ్చారు. మొత్తం మీద వర్మయే దారి తప్పాడో లేక వర్మ చెప్పినట్టు సమాజమే దారి తప్పిందో తేల్చడం మాత్రం కష్టం. అయితే పిల్లలు బలవంతంగా కాకుండా ఇష్టపడి స్కూల్ కు వచ్చేలా విద్యావిధానాన్ని మాత్రం తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News