ఎన్టీఆర్‌ విషయంలో వారు ఏం చేసింది ఎర్రన్నాయుడే చెప్పారు...

తన తండ్రి ఎన్టీఆర్‌ను దించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్న సమయంలో ఆ పనిలో భాగస్వామ్యులు కావద్దని తన భర్తను తాను అపేందుకుప్రయత్నించానని బీజేపీ నాయకురాలు పురందేశ్వరి చెప్పారు. కానీ అప్పట్లో తన దగ్గుబాటి నిర్ణయానికి అడ్డుచెప్పేంత శక్తి తనకు లేకపోయిందన్నారు. ఆలోచించుకునే సమయం కూడా లేకుండా అంతా జరిగిపోయిందన్నారు. ఆ తర్వాత దగ్గుబాటి కూడా రియలైజ్ అయ్యారని సాక్షి టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. హరికృష్ణ, బాలకృష్ణలు చంద్రబాబు వైపు ఎందుకు నిలిచారో తనకు తెలియదన్నారు. మంత్రి […]

Advertisement
Update:2016-09-05 03:39 IST

తన తండ్రి ఎన్టీఆర్‌ను దించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్న సమయంలో ఆ పనిలో భాగస్వామ్యులు కావద్దని తన భర్తను తాను అపేందుకుప్రయత్నించానని బీజేపీ నాయకురాలు పురందేశ్వరి చెప్పారు. కానీ అప్పట్లో తన దగ్గుబాటి నిర్ణయానికి అడ్డుచెప్పేంత శక్తి తనకు లేకపోయిందన్నారు. ఆలోచించుకునే సమయం కూడా లేకుండా అంతా జరిగిపోయిందన్నారు. ఆ తర్వాత దగ్గుబాటి కూడా రియలైజ్ అయ్యారని సాక్షి టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. హరికృష్ణ, బాలకృష్ణలు చంద్రబాబు వైపు ఎందుకు నిలిచారో తనకు తెలియదన్నారు. మంత్రి పదవుల గురించి వారే అంతర్గతంగా మాట్లాడుకున్నారని తనకు ఆ విషయం తెలియదన్నారు.

చంద్రబాబు పార్టీని ఆక్రమించుకున్న తర్వాత ఎన్టీఆర్‌ సింహం గుర్తు తెచ్చుకున్నారని… ఒకవేళ తన తండ్రి బతికి ఉంటే చంద్రబాబును ఎదురించి నిలబడేవారని అన్నారు. కానీ తిరుగుబాటు జరిగిన కొద్ది కాలానికే ఆయన చనిపోయారన్నారు. పార్టీని లాక్కోవడం, అసెంబ్లీలో కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం వంటి ఘోర అవమానాలను ఎన్టీఆర్‌ ఎదుర్కొన్నారని… వాటి ప్రభావంకూడా ఆయనపై పడిందన్నారు. ఆ పరిమాణం తర్వాత ఎన్టీఆర్‌ ఎక్కువ రోజులు జీవించలేదని పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ అసెంబ్లీ నుంచి కన్నీరు పెడుతూ బయటకు వస్తున్న సన్నివేశం చూసి ప్రతిపక్ష సభ్యులైన తమకే చాలా బాధేసిందని రోశయ్య కూడా చెప్పారని పురందేశ్వరి వెల్లడించారు.

ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఆయన బొమ్మ కూడా టీడీపీలో లేకుండా చేయాలని చూశారని చెప్పారు. చివరకు పార్టీ సభ్యత్వం పుస్తకాల్లోనూ ఎన్టీఆర్‌ బొమ్మను ముద్రించకుండా చేశారన్నారు. ఈ విషయాన్ని ఒక సందర్బంలో ఎర్రన్నాయుడే స్వయంగా చెప్పారన్నారు. కానీ ఎన్టీఆర్‌ బొమ్మ లేని టీడీపీని ప్రజలు తిరస్కరిస్తూ వచ్చారన్నారు. కుటుంబసభ్యులు పట్టించుకోకపోవడంతోనే లక్ష్మిపార్వతిని ఎన్టీఆర్‌ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందన్న అభిప్రాయంపై పురందేశ్వరి ఆచితూచీ స్పందించారు. తాను అవినీతికి పాల్పడలేదని కాబట్టి టీడీపీ నేతలు చేసే ఆరోపణలకు బాధపడాల్సిన అవసరం లేదన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News