రిలయన్స్ సంచలన ఆఫర్.. గిలగిలలాడిన ఇతర కంపెనీల షేర్లు
టెలికాం రంగంలో గుత్తాధిపత్యానికి ప్రయత్నిస్తున్న రిలయన్స్ అందుకు తగ్గట్టే ప్రకటన చేసింది. రిలయన్స్ జియో ద్వారా మార్కెట్ మొత్తం కొల్లగొట్టేందుకు సిద్దమైంది. కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన ముఖేష్ అంబాని రిలయన్స్ జియో భవిష్యత్తు ప్రణాళికను వెల్లడించింది. ఈనెల 5న ప్రారంభం కానున్న రిలయెన్స్ జియోలో కేవలం రూ. 50 రూపాయలకు 1GB డేటా ఇస్తున్నట్టు ప్రకటించారు. తొలి 90 రోజుల పాటు వాయిస్ కాల్స్ ఉచితంగా అందిస్తున్నట్టు చెప్పారు. రిలయెన్స్ జియో నుంచి ఏ […]
టెలికాం రంగంలో గుత్తాధిపత్యానికి ప్రయత్నిస్తున్న రిలయన్స్ అందుకు తగ్గట్టే ప్రకటన చేసింది. రిలయన్స్ జియో ద్వారా మార్కెట్ మొత్తం కొల్లగొట్టేందుకు సిద్దమైంది. కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన ముఖేష్ అంబాని రిలయన్స్ జియో భవిష్యత్తు ప్రణాళికను వెల్లడించింది. ఈనెల 5న ప్రారంభం కానున్న రిలయెన్స్ జియోలో కేవలం రూ. 50 రూపాయలకు 1GB డేటా ఇస్తున్నట్టు ప్రకటించారు. తొలి 90 రోజుల పాటు వాయిస్ కాల్స్ ఉచితంగా అందిస్తున్నట్టు చెప్పారు. రిలయెన్స్ జియో నుంచి ఏ ఇతర నెట్‌వర్క్‌కైనా ఉచిత రోమింగ్ ఉంటుందని అంబాని ప్రకటించారు.
రిలయెన్స్ జియోను ప్రధాని డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్‌కు అంకితమిస్తున్నట్టు చెప్పారు. తక్కువ సమయంలోనే 10 కోట్ల మంది వినియోగదారులను సంపాదించాలన్నదే తన లక్షమని అంబాని చెప్పారు. దేశంలో 2017 నాటికి 90శాతం గ్రామాలకు తమ సేవలు అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఉన్నామన్నారు. అత్యధిక క్వాలిటీ వర్చువల్ రియాల్టీ, అగ్మెంటెడ్ రియాల్టీలో లీడర్లుగా ఎదుగుతామనీ, పండుగ రోజుల్లో మెసేజ్ ల బ్లాకేజ్ ఉండదని ఆయన స్పష్టం చేశారు. పది ప్రధాన ప్లాన్లతో ముందుకు వస్తున్నట్టు ముకేశ్ ప్రకటించారు. ఇంతటి తక్కువ ధరకు డేటా అందిస్తున్నది ప్రపంచంలో రిలయన్స్ మాత్రమేనని చెప్పారు.
మరోవైపు రిలయన్స్ ప్రకటనతో స్టాక్ మార్కెట్‌లో ఇతర టెలికాం కంపెనీల షేర్లు కుదుపుకు గురయ్యాయి. రిలయన్స్ ప్రకటన రాగానే ఎయిర్‌టెల్ షేర్ ఏకంగా ఏడు శాతం మేర పతనం అయింది. మిగిలిన కంపెనీల షేర్లపైనా రిలయన్స్ ప్రభావం కనిపించింది.
Click on Image to Read: