కేసీఆర్ కు జానా చురకలు!
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి కోపం వచ్చింది. రావడం అంటే అలా.. ఇలా కాదు. తనపై సీఎం కేసీఆర్ చేసిన విమర్శలకు తనదైన శైలిలో ప్రతివిమర్శలు చేశారు. మాటల విషయంలో కేసీఆర్ కు హితవు చెబుతూనే చురకలు అంటించారు. విమర్శలు హుందాగా ఉండాలని సూచించారు. మహారాష్ట్రతో సాగునీటి ఒప్పందాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబట్టడంపై బుధవారం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. కాంగ్రెస్ నాయకులను సన్నాసులతో పోల్చారు. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, […]
Advertisement
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి కోపం వచ్చింది. రావడం అంటే అలా.. ఇలా కాదు. తనపై సీఎం కేసీఆర్ చేసిన విమర్శలకు తనదైన శైలిలో ప్రతివిమర్శలు చేశారు. మాటల విషయంలో కేసీఆర్ కు హితవు చెబుతూనే చురకలు అంటించారు. విమర్శలు హుందాగా ఉండాలని సూచించారు. మహారాష్ట్రతో సాగునీటి ఒప్పందాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబట్టడంపై బుధవారం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. కాంగ్రెస్ నాయకులను సన్నాసులతో పోల్చారు. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానా రెడ్డిలను పేర్లను ప్రస్తావిస్తూ.. తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అదేరోజు ప్రతివిమర్శలు చేశారు. కానీ జానారెడ్డి రెండురోజులు ఆగి స్పందించారు.
సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి హుందాగా మాట్లాడాలన్నారు. ఊత పదాలను వాడుతూ ఎదుటివారిని చులకన చేయడం మానుకోవాలని సూచించారు. విమర్శలు చేసిన ప్రతిపక్ష నేతలను జైల్లో వేస్తాననడం సమంజసం కాదన్నారు. తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్తారన్న విషయం మరచిపోవద్దన్నారు. ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ వాస్తవాలు దాస్తున్నారని జానారెడ్డి ఆరోపించారు. తమ్మిడి హెట్టి ప్రాజెక్టు ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడం బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా తమ హక్కని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా జైల్లో వేస్తాననడం బెదిరించడమేనన్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు.
Advertisement