"ఈ స్థాయికి పరిస్థితి వెళ్లకూడదు" " పవన్‌ ... నిందితుడు ఆ హీరో అభిమానులేనా?

మరో హీరో అభిమానుల చేతిలో హత్యకు గురైన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని తిరుపతిలో పవన్ కల్యాణ్ పరామర్శించారు. వినోద్ తల్లిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. విలపించిన ఆమెను ఓదార్చారు. ఈ సందర్బంగా అభిమానులకు పవన్ సూచనలు చేశారు. సినీ రంగంలో హీరోల మధ్య పోటీతత్వం ఉంటుందే గానీ ఎలాంటి గొడవలు ఉండవన్నారు. హీరోలమంతా బాగానే ఉంటామని.. కింది స్థాయిలో అభిమానులు మాత్రం గొడవ పడుతున్నారని ఆవేదన చెందారు. అభిమానం హద్దుల్లో ఉండాలని సూచించారు. నటులంతా […]

Advertisement
Update:2016-08-25 11:06 IST

మరో హీరో అభిమానుల చేతిలో హత్యకు గురైన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని తిరుపతిలో పవన్ కల్యాణ్ పరామర్శించారు. వినోద్ తల్లిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. విలపించిన ఆమెను ఓదార్చారు. ఈ సందర్బంగా అభిమానులకు పవన్ సూచనలు చేశారు. సినీ రంగంలో హీరోల మధ్య పోటీతత్వం ఉంటుందే గానీ ఎలాంటి గొడవలు ఉండవన్నారు. హీరోలమంతా బాగానే ఉంటామని.. కింది స్థాయిలో అభిమానులు మాత్రం గొడవ పడుతున్నారని ఆవేదన చెందారు. అభిమానం హద్దుల్లో ఉండాలని సూచించారు. నటులంతా కలిసి ఉంటే అభిమానులు మాత్రం ఇలా ఎందుకు గొడవపడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. అభిమానం హద్దులు దాటితే విపత్కర పరిణామాలకు దారితీస్తుందని అన్నారు. మితిమీరిన అభిమానం హింసకు దారితీయడం సహించరానిదని పవన్ చెప్పారు. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని పవన్ డిమాండ్ చేశారు. ఒకవేళ నిందితులను శిక్షించడంలో ప్రభుత్వం విఫలమైతే సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తామని చెప్పారు.

మరోవైపు వినోద్‌ రాయల్ హత్యకు కారకుడైన అక్షయ్ కుమార్‌ను కర్నాటక పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో మొత్తం ఏడుగురి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు నిర్దారణకు వచ్చారు. కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో ఇద్దరు హీరోల అభిమానులు రెండు రోజుల క్రితం ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణ పెద్దగా మారి పవన్ అభిమాని వినోద్ కత్తిపోట్లకు గురై చనిపోయాడు. వినోద్ హత్యకు కారకుడైన అక్షయ్ కుమార్ … నందమూరి ఫ్యామిలీ అభిమానిగా మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News