సబితా ఇంద్రారెడ్డికి షాక్ ఇచ్చిన టీ ప్రభుత్వం
మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి కేసీఆర్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆమెకున్న గన్‌మెన్‌ను తొలగించింది. ఈ మేరకే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లక్రితం వరకు హోంమంత్రిగా ఉన్న వ్యక్తికి గన్‌మెన్ తొలగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికి కేసీఆర్ కక్ష సాధింపు చర్య అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై సబితా ఇంద్రారెడ్డి కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారని సమాచారం. జయలలితపై సుప్రీం ఆగ్రహం తమిళనాడు […]
మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి కేసీఆర్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆమెకున్న గన్‌మెన్‌ను తొలగించింది. ఈ మేరకే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లక్రితం వరకు హోంమంత్రిగా ఉన్న వ్యక్తికి గన్‌మెన్ తొలగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికి కేసీఆర్ కక్ష సాధింపు చర్య అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై సబితా ఇంద్రారెడ్డి కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారని సమాచారం.
జయలలితపై సుప్రీం ఆగ్రహం
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విపక్ష నేతలపై పరువు నష్టం దావాలు వేయడం తగదని మొట్టికాయలు వేసింది. ప్రజాప్రతినిధులన్నాక విమర్శలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వాటన్నింటిపైనా దావాలు వేయడం సరికాదంది. పరువు నష్టం కేసుల పేరుతో ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్న రాష్ట్రం తమిళనాడు ఒక్కటేనని సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇకపై ఇలాంటి పద్దతి మానుకోవాలని సూచించింది. గడిచిన ఐదేళ్లలో జయలలిత ప్రభుత్వం 200కు పైగా పరువు నష్టం దావాలు వేసింది. వీటిలో 55 దావాలను మీడియాపై దాఖలు చేశారు. మరో 85 పరువు నష్టం దావాలు డీఎంకే నేతలపై వేసింది జయ ప్రభుత్వం.
Click on Image to Read: