నేరుగా వెళ్లి రాజీనామా చేస్తా- కేసీఆర్
తమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని హైదరాబాద్ వచ్చిన సీఎం కేసీఆర్‌కు పార్టీ శ్రేణులు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్బంగా మాట్లాడిన కేసీఆర్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. తమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో 152 మీటర్లకు గతంలోనే ఒప్పందం కుదిరిందంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి చెప్పడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ అదే నిజమైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ఒప్పంద పత్రం తీసుకుని రావాలని […]
తమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని హైదరాబాద్ వచ్చిన సీఎం కేసీఆర్‌కు పార్టీ శ్రేణులు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్బంగా మాట్లాడిన కేసీఆర్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. తమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో 152 మీటర్లకు గతంలోనే ఒప్పందం కుదిరిందంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి చెప్పడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ అదే నిజమైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ఒప్పంద పత్రం తీసుకుని రావాలని సవాల్ చేశారు. తాను కావాలంటే మరో గంట సేపు ఎయిర్‌పోర్టు వద్దే ఉంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజంగా ఒప్పంద పత్రం తీసుకొస్తే తాను ఇంటికి కూడా వెళ్లనని నేరుగా రాజ్‌భవన్ వెళ్లి రాజీనామా లేఖ అందజేస్తానని చాలెంజ్ చేశారు. మహా రాష్ట్రతో ఒప్పందంపై ప్రజలంతా ఆనందంగా ఉంటే కాంగ్రెస్ సన్యాసులకు మాత్రం నల్లజెండాలు కనిపిస్తున్నాయని కేసీఆర్ అన్నారు. ఇంతకాలం ప్రతిపక్షాల విమర్శల విషయంలో చాలా ఓర్పుగా ఉన్నానని కేసీఆర్ చెప్పారు. ఇకపై తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెట్టబోతున్నామని హెచ్చరించారు. చేసిన ఆరోపణలు నిరూపించని పక్షంలో జైలుకెళ్లి చిప్పకూడు తినాల్సి ఉంటుందన్నారు. తాను జగమొండినని ఒకటి అనుకుంటే చేసి తీరుతానని చెప్పారు. రెండు మూడు రోజుల్లో ఒక టీవీ ఛానల్‌లో కూర్చుని కాంగ్రెస్ నేతల బండారం మొత్తం ప్రజలకు వివరిస్తానన్నారు కేసీఆర్.
Click on Image to Read: