పీవీ దేవుడేం కాదు...

మాజీ ప్రధాని పీవి నరసింహారావును ఆర్థిక సంస్కరణలవాదిగా పిలవడాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తప్పుపట్టారు. ఆర్థిక సంస్కరణలకు పీవీ నరసింహారావు ఏమీ దేవుడు కాదన్నారు. అసలు ఆర్థిక సంస్కరణల పట్ల పీవీకి సానుకూలత లేదని చెప్పారు. నెహ్రు ఆర్థిక విధానాలు విఫలమైన నేపథ్యంలో గత్యంతరం లేకనే పీవీ ఆర్థిక సంస్కరణలకు ఒప్పుకున్నారని చెప్పారు. పీవీ ప్రధాని అయిన సమయంలో దేశంలో విదేశీ మారక నిల్వలు పూర్తిగా లేకుండాపోయాయని, దేశం దివాలా తీసే పరిస్థితుల్లో ఉండబట్టే […]

Advertisement
Update:2016-08-21 06:29 IST

మాజీ ప్రధాని పీవి నరసింహారావును ఆర్థిక సంస్కరణలవాదిగా పిలవడాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తప్పుపట్టారు. ఆర్థిక సంస్కరణలకు పీవీ నరసింహారావు ఏమీ దేవుడు కాదన్నారు. అసలు ఆర్థిక సంస్కరణల పట్ల పీవీకి సానుకూలత లేదని చెప్పారు. నెహ్రు ఆర్థిక విధానాలు విఫలమైన నేపథ్యంలో గత్యంతరం లేకనే పీవీ ఆర్థిక సంస్కరణలకు ఒప్పుకున్నారని చెప్పారు. పీవీ ప్రధాని అయిన సమయంలో దేశంలో విదేశీ మారక నిల్వలు పూర్తిగా లేకుండాపోయాయని, దేశం దివాలా తీసే పరిస్థితుల్లో ఉండబట్టే ఆర్థిక సంస్కరణలకు పీవీ సిద్ధపడ్డారని చెప్పారు. పీవీకి కూడా నెహ్రు విధానాల పట్లే సానుకూలత ఉండేదన్నారు. పీవీ ఎందుకు సంస్కరణవాది కాదు అనేందుకు ఉదాహరణ కూడా చెప్పారు. పీవీ ఏపీలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ప్రైవేట్ కాలేజీలను రద్దు చేయించారని గుర్తు చేశారు. పీవీ దేశాన్ని సంస్కరణలతో ఆర్థికంగా ఉద్ధరించిన ఎకనామిక్ మెసయ్యా కానేకాదన్నారు అరుణ్ జైట్లీ. ముంబైలో ఒక కార్యక్రమానికి హాజరైనసమయంలో అక్కడ ప్రసంగిస్తూ జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News