పెద్దలు జానారెడ్డి మళ్లీ పొగిడేశారు!
పెద్దలు జానారెడ్డి మళ్లీ కేసీఆర్ ని పొగిడారు. మొదటి నుంచి జానారెడ్డిని కేసీఆర్ కోవర్టు అంటూ కాంగ్రెస్ పార్టీలోని నేతలు విమర్శిస్తునప్పటికీ మరోసారి ఆయన అలాంటి కామెంట్లే చేయడం సంచలనం సృష్టించింది. నయీంని ఎన్‌కౌంటర్ చేయడం కేసీఆర్ సర్కారు చేసిన మంచి పని అని ఆయన కితాబిచ్చారు. మంచి పని ఎవరు చేసినా అభినందించాల్సిందేని స్పష్టం చేశారు. నయీం విచారణను సీబీఐకి అప్పగించాలనడం అవివేకమని తేల్చేశారు. నయీం కేసును సిట్ నుంచి తప్పించి సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ […]
పెద్దలు జానారెడ్డి మళ్లీ కేసీఆర్ ని పొగిడారు. మొదటి నుంచి జానారెడ్డిని కేసీఆర్ కోవర్టు అంటూ కాంగ్రెస్ పార్టీలోని నేతలు విమర్శిస్తునప్పటికీ మరోసారి ఆయన అలాంటి కామెంట్లే చేయడం సంచలనం సృష్టించింది. నయీంని ఎన్‌కౌంటర్ చేయడం కేసీఆర్ సర్కారు చేసిన మంచి పని అని ఆయన కితాబిచ్చారు. మంచి పని ఎవరు చేసినా అభినందించాల్సిందేని స్పష్టం చేశారు. నయీం విచారణను సీబీఐకి అప్పగించాలనడం అవివేకమని తేల్చేశారు. నయీం కేసును సిట్ నుంచి తప్పించి సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేసి 24 గంటలు కూడా గడవకముందే ఆ వ్యాఖ్యలను జానారెడ్డి తప్పుబట్టం గమనార్హం. నయీం కేసును సిట్ దర్యాప్తు చేయడమే కరక్టని చెప్పేశారు. తాను హోంమంత్రిగా ఉన్నపుడు సైతం నయీం ను పట్టుకునేందుకు ప్రయత్నించానని, అయితే ఆ పనిలో సఫలం కాలేకపోయామని చెప్పారు. ఆ రోజు మా ప్రభుత్వం ఆ పని ప్రారంభించింది కాబట్టే ఈరోజు టీఆర్ ఎస్ ప్రభుత్వం పూర్తి చేయగలిగిందని చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్లీ ప్రశంసించడంతో జానా వ్యతిరేకులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు రాలేదని, ఇప్పుడు ఇలా మళ్లీ టీఆర్ ఎస్‌ని పొగడటం ఏంటని మండిపడుతున్నారు. ఆయన కేసీఆర్ కోవర్టు అనడానికి ఇంతకంటే నిదర్శనమేముంటుందని ఆరోపిస్తున్నారు. అయితే, తాను పుణ్యక్షేత్రాలకు వెళ్లానని అందుకే హాజరు కాలేకపోయానని, ఇందులో మరే ఇతర ఉద్దేశాలు లేవని జానారెడ్డి స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి పెద్దలుజానారెడ్డి గారు సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేయడం చాలా మంది కాంగ్రెస్ నేతలకు రుచించడం లేదు.
Click on Image to Read: