ప్రేక్షకుల సహనానికి పరీక్ష
రివ్యూ: చుట్టాలబ్బాయి విడుదల తేదీ : ఆగష్టు 19, 2016 రేటింగ్ : 1/5 దర్శకత్వం : వీరభద్రం చౌదరి నిర్మాత : వెంకట్ తలారి, రామ్ తల్లూరి సంగీతం : ఎస్.ఎస్. థమన్ నటీనటులు : ఆది, నమిత ప్రమోద్ తదితరులు సన్నాఫ్ సాయికుమార్ గా ఎంట్రీ ఇచ్చిన హీరో ఆది.. లెక్కకు మించి సినిమాలు చేసినప్పటికీ ఇప్పటికీ అదే ముద్రతో చెలామణి అవుతున్నాడు. అంతేకాని తనూ లెక్కల్లో మనిషి అనిపించుకోవటానికి, నా టాలెంట్ ఇదీ, […]
రివ్యూ: చుట్టాలబ్బాయి
విడుదల తేదీ : ఆగష్టు 19, 2016
రేటింగ్ : 1/5
దర్శకత్వం : వీరభద్రం చౌదరి
నిర్మాత : వెంకట్ తలారి, రామ్ తల్లూరి
సంగీతం : ఎస్.ఎస్. థమన్
నటీనటులు : ఆది, నమిత ప్రమోద్ తదితరులు
సన్నాఫ్ సాయికుమార్ గా ఎంట్రీ ఇచ్చిన హీరో ఆది.. లెక్కకు మించి సినిమాలు చేసినప్పటికీ ఇప్పటికీ అదే ముద్రతో చెలామణి అవుతున్నాడు. అంతేకాని తనూ లెక్కల్లో మనిషి అనిపించుకోవటానికి, నా టాలెంట్ ఇదీ, నా సామర్ద్యం ఇదీ అని ఐడిండెటీ చూపెట్టే ఒక్క సినిమా కూడా అతని కెరీర్ లో చేయలేకపోయాడు.ఎంతసేపూ మిగతా హీరోలు అరిగ తీసి పారేసిన ఫార్ములాతో రఫ్ ఆడించేద్దాం అనుకోవటమే,బోల్తాపడటమే. మరి కనీసం ఈసారైన ఆది తన ఖాతాలో ఒక మంచి హిట్ వేసుకున్నాడా..? ఆ విశేషాలన్ని సమీక్షలో చూసేద్దాం…
ఇప్పుడు మరోసారి మరో మూస కథతో,ప్రాస డైలాగులతో వచ్చాడు. చూస్తూంటే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చుట్టపు చూపే కానీ, కొద్దికాలం నిలబడేటట్లు కనపడటం లేదు. రికవరీ ఏజెంట్ బాబ్జీ(ఆది) అనుకోకండా ఏసీపీ కమ్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు (అభిమన్యుసింగ్) కి విరోధమవుతాడు. అందుకు కారణం బాబ్జీ తన చెల్లెలు కావ్య (నమిత ప్రమోద్) కు లైన్ వేస్తున్నాడేమో అనే డౌట్. కావ్య ఓసారి బాబ్జీతో చనువుగా ఉండడం చూసి బాబ్జీకి వార్నింగ్ ఇస్తాడు ఏసీపీ. నిజానికి కావ్య.. బాబ్జీల మధ్య చిన్న స్నేహం కూడా ఉండదు. తమది ప్రేమ కాదని ఏసీపికి చెప్పి క్లారిటీ ఇచ్చే సమయానికి ఇంటి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది కావ్య.
కావ్య ఇంటిలో నుంచి పారిపోవటానికి కారణం…ఆమెకు ఇష్టం లేకుండా తన అన్న పెళ్లి ఫిక్స్ చేయటమే. అయితే కో ఇన్సిడెంటల్ గా అక్కడికి వచ్చిన బాబ్జీ ఆమెతో కనిపిస్తాడు. దాంతో ‘వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొని పారిపోతున్నార’ని ఫిక్సయిపోతారు మన ఎసిపీ. అక్కడ్నుంచి బాబ్జీ.. కావ్యల వెంటపడతారు పోలీసులు. వాళ్లని తప్పించుకొనే ప్రయత్నంలో ఉండగానే మరో గ్యాంగ్ కూడా కావ్య కోసం వెదుకుతూ ఎదురవుతుంది. ఇదిలా ఉంటే దొరబాబు (సాయికుమార్) మనుషులు బాబ్జీ.. కావ్యలను కిడ్నాప్ చేసేస్తారు. మధ్యలో ఈ దొరబాబు ఎవరు? ఆమె వెనక పడుతున్న ఆ గ్యాంగ్ ఎవరు…హీరో ఏం చేసాడు..అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా లవ్ ట్రాక్, ఎసిపి ట్రాక్ యాజటీజ్ మొత్తం కన్నడంలో 2012 లో శ్రీహరి, ప్రియమణి, శ్రీనగర్ కిట్టి కాంబినేషన్ లో వచ్చిన ‘కో కో కోలి కోతి’ అనే చిత్రం నుంచి లిఫ్ట్ చేసిందే అని స్పష్టంగా అర్దమవుతుంది. మిగతాదంతా మన తెలుగు రొటీన్ కామెడీలోకి వచ్చేసాడు. అందుకేనేమో ఫస్టాఫ్ పరవాలేదు అన్న ఫీల్ వచ్చింది. సెకండాఫ్ తేడా కొట్టిందని తెలుస్తుంది. అలాగే విలన్ పాత్ర చూస్తూంటే రీసెంట్ గా అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సెల్ఫీ రాజాలో విలన్ ట్రాక్ గుర్తుకు వస్తూంటుంది. ఇంకేం ఉంది ఈ సినిమా లో కొత్తగా అనిపిస్తూంటుంది.
సినిమా చూస్తున్నంత సేపు నిర్మాతలు పెట్టిన ఖర్చు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే కెమెరా పనితనం కూడా చాలా బాగుంది. ఈ సినిమాకు మైనస్ అంతా దర్శకుడే. పల్లెటూరి నైపథ్యంలో సాగే రెండవ భాగంలో కెమెరా వర్క్ అందంగా ఉంది. షకలక శంకర్ పాత్రలకు రాసిన కామెడీ పంచ్ డైలాగులు బాగున్నాయి. థమన్ అందించిన సంగీతం మొదటి పాట బాగుండి మిగతా పాటలన్నీ పరవాలేదనిపించాయి. ఎడిటింగ్ బాగుంది. దర్శకుడు వీరభద్రం చౌదరి విషయానికొస్తే కథని మొదలుపెట్టిన తీరు, కామెడీ ట్రాక్ ను కథతో పాటే నడిపిన విధానం పరవాలేదు. సెకండ్ హాఫ్ లో ఆకట్టుకునే సన్నివేశాలు, కొత్తదనం పూర్తిగా లోపించాయి. ఏదో ఒక తిరగమోత సినిమా చూద్దాం అనుకుంటే ఒకసారి చూడోచ్చు. కొత్త దనం లాంటి పదాలు ఆలోచిస్తే సినిమాకు వెళ్లక పోవడమే బెస్ట్. కొందరు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు దర్శకుడు. సాయికుమార్ లాంటి అనుభవం ఉన్న నటుడు ఇలాంటి దర్శకున్ని ఎందుకు ఎన్నుకున్నాడో ఆయనకే తెలియాలి.
-బెన్నీ
Also Read