టీచర్ పోస్టుకు మహాత్మా గాంధీ, అమితాబ్ దరఖాస్తు!
ఇదేంటి… దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహాత్మా గాంధీ, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో నిజంగానే చోటు చేసుకుంది. మరో విషయమేంటంటే.. మహాత్మాగాంధీ, అమితాబ్ బచ్చన్లు మెరిట్ లిస్టులో టాప్ ప్లేస్‌లో ఉన్నారు. వీరిలో మహాత్మాగాంధీ ఏకంగా 94 శాతం మార్కులతో అందరి కంటే అగ్రభాగాన ఉన్నారు. అసిస్టెంట్ టీచర్ పోస్టులకు ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం దీనికి పెద్ద సంఖ్యలో […]
Advertisement
ఇదేంటి… దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహాత్మా గాంధీ, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో నిజంగానే చోటు చేసుకుంది. మరో విషయమేంటంటే.. మహాత్మాగాంధీ, అమితాబ్ బచ్చన్లు మెరిట్ లిస్టులో టాప్ ప్లేస్‌లో ఉన్నారు. వీరిలో మహాత్మాగాంధీ ఏకంగా 94 శాతం మార్కులతో అందరి కంటే అగ్రభాగాన ఉన్నారు. అసిస్టెంట్ టీచర్ పోస్టులకు ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం దీనికి పెద్ద సంఖ్యలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయి.
వీటిలో మెరిట్ ఆధారంగా ఓ జాబితా సిద్ధం చేశారు అధికారులు. టాప్ జాబితాలో ఉన్న కొన్ని పేర్లు వారికి అనుమానం కలిగేలా చేశాయి. మహాత్మాగాంధీ, అమితాబ్ బచ్చన్ పేర్లతో కొన్ని దరఖాస్తులు రావడమే ఇందుకు కారణం. అవి కూడా 94 శాతం మార్కులతో ఉండటంతో నిజంగానే ఆ పేరు ఉన్న అభ్యర్థులు ఉన్నారేమో అని సర్ది చెప్పుకున్నారు అధికారులు. కానీ, మెరిట్ జాబితా ప్రకటించినా.. ఆ వ్యక్తులు రాకపోయేసరికి ఇది ఆకతాయిల పనేనని నిర్ణయానికి వచ్చి దరఖాస్తులను పక్కనబెట్టారు.
Advertisement