మహారాష్ట్రలో గవర్నర్ కంటే...ఆయన సెక్రటరీ జీతం ఎక్కువ!
మహారాష్ట్రలో గవర్నరు, శాసనసభ్యులు, కార్యదర్శుల జీతాల విషయంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొనబోతోంది. త్వరలో ఇక్కడ ఏడవ పే కమిషన్ సిఫార్సులు అమలు కానున్నాయి. అవి అమలు అయితే గవర్నరు వేతనం కంటే ఆయన సొంత సెక్రటరీ శాలరీ ఎక్కువగా ఉంటుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి… రాష్ట్రపతి కంటే ఎక్కువ మొత్తంలో జీతం తీసుకుంటారు. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ఎమ్ఎల్ఎల జీతాలను పెంచుతూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ రాష్ట్ర గవర్నర్ సి. విద్యాసాగర్‌రావు ఎప్పటిలాగే నెలకు […]
మహారాష్ట్రలో గవర్నరు, శాసనసభ్యులు, కార్యదర్శుల జీతాల విషయంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొనబోతోంది. త్వరలో ఇక్కడ ఏడవ పే కమిషన్ సిఫార్సులు అమలు కానున్నాయి. అవి అమలు అయితే గవర్నరు వేతనం కంటే ఆయన సొంత సెక్రటరీ శాలరీ ఎక్కువగా ఉంటుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి… రాష్ట్రపతి కంటే ఎక్కువ మొత్తంలో జీతం తీసుకుంటారు. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ఎమ్ఎల్ఎల జీతాలను పెంచుతూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ రాష్ట్ర గవర్నర్ సి. విద్యాసాగర్‌రావు ఎప్పటిలాగే నెలకు 1.1 లక్షలు శాలరీ తీసుకుంటే ఆయన సొంత సెక్రటరీ 1.44లక్షలు జీతంగా పొందుతారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేతనం 2.25 లక్షలకు చేరుతుంది. అలాగే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వేతనం 2.25 లక్షలయితే….దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి వేతనం 1.5 లక్షలు మాత్రమే ఉంటుంది. ఉపరాష్టపతి వేతనం 1.25 లక్షలు ఉంది. 2008లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్‌ల వేతనాలు పెరిగాయి.
మహారాష్ట్రలో పెరుగుతున్న ఈ వేతనాల కారణంగా రాష్ట్రంపై సంవత్సరానికి 21వేల కోట్ల భారం పెరుగుతుంది. ఇప్పటికే రిజర్వుబ్యాంకు లెక్కల ప్రకారం రాష్ట్ర రుణభారం అన్ని రాష్ట్రాలకంటే ఎక్కువగా 3.79లక్షల కోట్లు ఉంది. జీతాలు పెరగటం ఎవరికి మాత్రం ఇష్టముండదు…కానీ ఈ పరిస్థితిపై కపిల్ పాటిల్ అనే ఎమ్మెల్యే మాత్రం వ్యతిరేకతని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో టీచర్లు 15ఏళ్లగా జీతాల్లో పెరుగుదల లేకుండా ఉద్యోగాలు చేస్తుండగా…2005 నుండి వారి పెన్షన్ సదుపాయాలు సైతం ఆపేసిన నేపథ్యంలో మంత్రులు, శాసన సభ్యుల జీతాలను ఈ స్థాయిలో పెంచడం సముచితం కాదంటున్నారు ఆయన.