చంద్రబాబు డైలాగ్‌ను వాడిన మోదీ
మెదక్ జిల్లా గజ్వేల్ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ… కేసీఆర్ చేస్తున్న పనులను అభినందించారు. కేసీఆర్ సంకల్పంతో మిషన్ భగీరథ విజయవంతమవుతోందన్నారు. కేసీఆర్ పని ఆదర్శనీయమన్నారు. ఏపీ సీఎం పదేపదే ఆంధ్రప్రదేశ్ రెండేళ్ల పసిపాప డైలాగ్‌ను వినిపిస్తుంటారు. అయితే మోదీ కూడా అదే డైలాగ్‌ను తెలంగాణ విషయంలో వాడడం విశేషం. తెలంగాణ రెండేళ్ల పసిపాప అని… దేశంలోనే అతి చిన్న వయసున్న రాష్ట్రం అని అన్నారు. దేశానికి రైతులు పట్టుకొమ్మలని వారికి సాగు నీరు ఇస్తే బంగారం […]
మెదక్ జిల్లా గజ్వేల్ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ… కేసీఆర్ చేస్తున్న పనులను అభినందించారు. కేసీఆర్ సంకల్పంతో మిషన్ భగీరథ విజయవంతమవుతోందన్నారు. కేసీఆర్ పని ఆదర్శనీయమన్నారు. ఏపీ సీఎం పదేపదే ఆంధ్రప్రదేశ్ రెండేళ్ల పసిపాప డైలాగ్‌ను వినిపిస్తుంటారు. అయితే మోదీ కూడా అదే డైలాగ్‌ను తెలంగాణ విషయంలో వాడడం విశేషం. తెలంగాణ రెండేళ్ల పసిపాప అని… దేశంలోనే అతి చిన్న వయసున్న రాష్ట్రం అని అన్నారు. దేశానికి రైతులు పట్టుకొమ్మలని వారికి సాగు నీరు ఇస్తే బంగారం పండించగలరన్నారు మోదీ. తమ హయాంలో ఎరువుల ధరలు బాగా తగ్గాయన్నారు. రెండేళ్ల కాలంలో ఏ ముఖ్యమంత్రి కూడా తమకు యూరియా కావాలంటూ లేఖలు రాసిన పరిస్థితి లేదన్నారు. గతంలో ఎరువుల కోసం రైతులు లాఠీదెబ్బలు తినాల్సి వచ్చేదన్నారు. ఒకప్పుడు విద్యుత్ కొరతలో ఉన్న రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ స్థాయికి చేర్చామని చెప్పారు. ప్రజల ఆకాంక్ష వల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు.
Click on Image to Read: