అయ్యో జేసీ...ఆ అర్హత కూడా లేదు

ప్రస్తుత అనంతపురం రాజకీయాల గురించి చెబితే తొలుత వినిపించేది జేసీ పేరే. సుధీర్ఘకాలం ఓటమిలేని నేతగా గెలుస్తూ వచ్చిన ఆయన అనివార్యపరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరాల్సివచ్చింది. అయితే ఆయనకు తగిన గౌరవం అక్కడ దక్కుతున్న దాఖలాలు కనిపించడం లేదు. తాజాగా శనివారం సీఎం పర్యటనలో ఆయనకు చేధుఅనుభవం ఎదురైంది. సీఎం సభలో ఓ పది నిమిషాలు మాట్లాడేందుకు కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేదు. బుక్కరాయసముద్రంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల సమాఖ్య ప్రారంభోత్సవ కార్యక్రమంలో జేసీ మాట్లాడేందుకు ప్రయత్నించగా […]

Advertisement
Update:2016-08-07 03:02 IST

ప్రస్తుత అనంతపురం రాజకీయాల గురించి చెబితే తొలుత వినిపించేది జేసీ పేరే. సుధీర్ఘకాలం ఓటమిలేని నేతగా గెలుస్తూ వచ్చిన ఆయన అనివార్యపరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరాల్సివచ్చింది. అయితే ఆయనకు తగిన గౌరవం అక్కడ దక్కుతున్న దాఖలాలు కనిపించడం లేదు. తాజాగా శనివారం సీఎం పర్యటనలో ఆయనకు చేధుఅనుభవం ఎదురైంది. సీఎం సభలో ఓ పది నిమిషాలు మాట్లాడేందుకు కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేదు.

బుక్కరాయసముద్రంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల సమాఖ్య ప్రారంభోత్సవ కార్యక్రమంలో జేసీ మాట్లాడేందుకు ప్రయత్నించగా కలెక్టర్, ఎమ్మెల్యే అంతరాయం కలిగించారు. ఓ దశలో జేసీ అసహనం వ్యక్తం చేశారు. జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడేందుకు మైక్ తీసుకోగానే కలెక్టర్‌ కోన శశికుమార్ వెళ్లి ప్రంసంగం చాలించాలని కోరారు. దీంతో ఆయన వైపు జేసీ కోపంగానే చూశారు. కలెక్టర్ వెళ్లి సీట్లో కూర్చుకున్నారు. మరో అర నిమిషంలోనే ఎమ్మెల్యే యామిని బాల వచ్చి అడ్డుపడ్డారు. ప్రసంగం ముగించండి అని కోరారు. దీంతో జేసీ ఆమెపై కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఇంతలోనే మంత్రి పల్లె రఘునాథరెడ్డి వచ్చి జేసీ చెవిలో ఏదో చెప్పి మైక్ తీసుకున్నారు.

మొత్తం మీద జేసీ దివాకర్ రెడ్డి కనీసం మూడు నిమిషాలు కూడా సభలో మాట్లాడలేకపోయారు. ప్రత్యేకహోదా అంశంపై ఇటీవల జేసీ దివాకర్ రెడ్డి పదేపదే మోహమాటం లేకుండా నిజాలు మాట్లాడుతుండడంతో మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తారన్న భయంతోనే ఆయనను ప్రసంగించకుండా అడ్డుకున్నారని భావిస్తున్నారు. ఈ పరిణామం చూసి సభకు వచ్చిన వారు ఆశ్చర్యపోయారు. కాంగ్రెస్‌లో కింగ్‌లా బతికిన జేసీ ఇప్పుడు మైక్‌ కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందన్న మాట.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News