మొత్తానికి వెలుగులోకి వచ్చాడు...

కొందరికి టాలెంట్ ఉంటుంది. కానీ కాలం కలిసిరాదు. అలాంటోడే దర్శకుడు పరశురాం. ఇతడి దగ్గర పుష్కలంగా టాలెంట్ ఉంది. కానీ ఎందుకో ప్రతిసారి టైం మాత్రం కలిసిరాదు. అప్పుడెప్పుడో సోలో లాంటి హిట్ అందుకున్న తర్వాత కూడా సైలెంట్ అయిపోయాడు పరశురాం. స్టార్టింగ్ లో మాస్ సినిమాలు తీసిన ఈ దర్శకుడు తర్వాత క్లాస్-డైరక్టర్ గా పేరుతెచ్చుకున్నాడు. తాజాగా వచ్చిన శ్రీరస్తు-శుభమస్తు సినిమాతో ఆ పేరును మరింత పదిలపరుచుకున్నాడు. తాజా సినిమా సక్సెస్ తో పరశురాం వైపు […]

Advertisement
Update:2016-08-07 04:52 IST

కొందరికి టాలెంట్ ఉంటుంది. కానీ కాలం కలిసిరాదు. అలాంటోడే దర్శకుడు పరశురాం. ఇతడి దగ్గర పుష్కలంగా టాలెంట్ ఉంది. కానీ ఎందుకో ప్రతిసారి టైం మాత్రం కలిసిరాదు. అప్పుడెప్పుడో సోలో లాంటి హిట్ అందుకున్న తర్వాత కూడా సైలెంట్ అయిపోయాడు పరశురాం. స్టార్టింగ్ లో మాస్ సినిమాలు తీసిన ఈ దర్శకుడు తర్వాత క్లాస్-డైరక్టర్ గా పేరుతెచ్చుకున్నాడు. తాజాగా వచ్చిన శ్రీరస్తు-శుభమస్తు సినిమాతో ఆ పేరును మరింత పదిలపరుచుకున్నాడు. తాజా సినిమా సక్సెస్ తో పరశురాం వైపు నిర్మాతలు, హీరోలు చూడ్డం మొదలుపెట్టారు. తాజా సమాచారం ప్రకారం… మెగా కాంపౌండ్ కు చెందిన ఓ హీరో పరశురాంను సంప్రదించినట్టు తెలుస్తోంది. తనకు కూడా శ్రీరస్తు-శుభమస్తు లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావాలని పరశురాంను కోరాడట. మరోవైపు ఓ నిర్మాత పరశురాంతో చర్చలు జరిపి…. నితిన్ కోసం ఓ సినిమా కథ రాయమని సలహా ఇచ్చాడట. మొత్తానికి శ్రీరస్తు-శుభమస్తు సినిమా విజయం… అల్లు శిరీష్ కు ఏమాత్రం కలిసొచ్చిందో అప్పుడే చెప్పలేం కానీ… డైరక్టర్ పరశురాంకు మాత్రం ఇనిస్టెంట్ గా కలిసొచ్చింది. త్వరలోనే తన నెక్ట్స్ సినిమాను ఎనౌన్స్ చేస్తానని పరశురాం ప్రకటించాడు. కథ కూడాసిద్ధంగా ఉందని క్లారిటీ ఇచ్చాడు.

Tags:    
Advertisement

Similar News