కెమెరా ముందు రెచ్చిపోతే ఇంతే- ఎమ్మెల్యేకు సీఎం వార్నింగ్
టీడీపీ వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొడ్ల రామకృష్ణకు చంద్రబాబు నుంచి చివాట్లు పడ్డాయి. ఎమ్మెల్యే తీరు ఇటీవల బాగా వివాదాస్పదం అవడం, కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా సీఎంకు ఫిర్యాదు చేయడంతో కురుగొడ్లను విజయవాడ పిలిపించుకుని సీఎం వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే కురుగొడ్ల రామకృష్ణపై జిల్లాలో అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ చేయించడం, కాంట్రాక్టర్లను బెదిరించి వసూళ్లు చేయడం వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఇటీవల మీడియాలో పెద్దెత్తున కథనాలు వచ్చాయి. వెంకటగిరి నియోజకవర్గంలో లక్ష రూపాయల పని […]
టీడీపీ వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొడ్ల రామకృష్ణకు చంద్రబాబు నుంచి చివాట్లు పడ్డాయి. ఎమ్మెల్యే తీరు ఇటీవల బాగా వివాదాస్పదం అవడం, కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా సీఎంకు ఫిర్యాదు చేయడంతో కురుగొడ్లను విజయవాడ పిలిపించుకుని సీఎం వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే కురుగొడ్ల రామకృష్ణపై జిల్లాలో అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ చేయించడం, కాంట్రాక్టర్లను బెదిరించి వసూళ్లు చేయడం వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఇటీవల మీడియాలో పెద్దెత్తున కథనాలు వచ్చాయి.
వెంకటగిరి నియోజకవర్గంలో లక్ష రూపాయల పని జరగాలన్నా ఎమ్మెల్యేకు సొమ్ము చెల్లించుకోవాల్సి వస్తోందని కాబట్టి అక్కడ తాము పనిచేయలేమని కాంట్రాక్టర్లు సీఎంకు ఫిర్యాదు చేశారు. పత్రికల్లో వచ్చిన కథనాలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అధికారులను తిట్టడం కురుగొట్లకు హాబీగా మారిందని ఫిర్యాదు చేశారు. జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు కూడా కురుగొడ్ల రామకృష్ణ అన్నింటికి అతీతుడైన్నట్టుగా వ్యవహరిస్తున్నారని సీఎంకు చెప్పినట్టు సమాచారం. వీటితో పాటు ఇటీవల ఒక ప్రముఖ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కొరుగొడ్ల రెచ్చిపోయారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ చేయిస్తున్నారట కదా అన్నందుకు కెమెరా ముందే బూతులు తిట్టారు. ఈ దేశంలో తనకంటే ఆవేశపరుడు, ధీరుడు లేడన్నట్టుగా పూలకుండి నేలకేసి కొట్టాడు. మీడియా ప్రతినిధిని బూతులు తిట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీడీపీ ఎమ్మెల్యేల పొగరుకు ఈ వీడియో నిదర్శనం అంటూ దాన్ని సోషల్ మీడియాలో బాగా తిప్పుతున్నారు. ఇవన్నీ సీఎం దృష్టికి వెళ్లడంతో పార్టీకి చెడ్డపేరు వస్తోందని సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారట. రెండేళ్లలో చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు చాలా వివాదాల్లో తలదూర్చారు. వారిని మాత్రం ఏమీ అనని చంద్రబాబుకు కురుగొడ్ల మాత్రమే చిక్కారన్న మాట.
Click on Image to Read: