చిరిగేది చంద్రబాబుదే...

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ను పలుచన చేసే విధంగా అరుణ్ జైట్లీ మాట్లాడినా చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎక్స్, వై, జడ్, ఏ, బీ, సీ… ఇలా ఏ రాష్ట్రం పడితే ఆ రాష్ట్రం డబ్బులు అడిగితే ఇస్తూ పోవడం పద్ధతి కాదని, డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా అన్నట్లుగా జైట్లీ మాట్లాడారని ఉండవల్లి మండిపడ్డారు. దేశంలో అందరూ ఏపికి ప్రత్యేక హోదాను సమర్ధిస్తుంటే […]

Advertisement
Update:2016-08-03 08:02 IST

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ను పలుచన చేసే విధంగా అరుణ్ జైట్లీ మాట్లాడినా చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎక్స్, వై, జడ్, ఏ, బీ, సీ… ఇలా ఏ రాష్ట్రం పడితే ఆ రాష్ట్రం డబ్బులు అడిగితే ఇస్తూ పోవడం పద్ధతి కాదని, డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా అన్నట్లుగా జైట్లీ మాట్లాడారని ఉండవల్లి మండిపడ్డారు. దేశంలో అందరూ ఏపికి ప్రత్యేక హోదాను సమర్ధిస్తుంటే బీజేపీ నేతలు మాత్రం బిహార్, ఒడిషాలాంటి రాష్ట్రాలు కూడా అడుగుతున్నాయంటూ దాటవేస్తున్నారని విమర్శించారు.

అరుణ్ జైట్లీ ప్రకటన తర్వాత తొలిరోజు రక్తం మరిగిందన్న చంద్రబాబు అప్పుడే ఎందుకు చల్లబడ్డారని ప్రశ్నించారు. ఆకు వచ్చి ముల్లు మీద పడ్డా ముల్లు వచ్చి ఆకు మీద పడ్డ ఆకుకే ఇబ్బంది అని మంగళవారం ప్రెస్‌మీట్లో చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని ఉండవల్లి తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ ఆకు ఎంతమాత్రం కాదన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఆంధ్రప్రదేశ్‌కు చిరిగేది ఏమీ ఉండదని… చిరిగేది చంద్రబాబుదేనని అన్నారు. ఈరోజుకి ఇంకా రాష్ట్ర విభజన అంశాన్నే పట్టుకుని చంద్రబాబు వేలాడుతున్నారని… గతాన్ని వదిలేసి ఇప్పుడు ఏం తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

పోలవరం ప్రాజెక్టు గురించి రాజ్యసభలో మంగళవారం కేంద్ర మంత్రి ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రాజెక్ట్‌పై ‘స్టాప్ వర్క్ ఆర్డర్’ ఆదేశాలను 2016 జూలై 7వ తేదీ వరకు అబెయన్స్‌లో పెట్టామన్నామని చెప్పారని గుర్తు చేశారు. అంటే ప్రస్తుతం స్టాప్ వర్క్ ఆర్డర్ అమలులో ఉందన్నారు. దీన్ని బట్టి పోలవరం ప్రాజెక్టు పనులు ఆపివేయాల్సి ఉంటుందన్నారు. ఓడిషా ఎంపీ పోలవరం ప్రాజెక్టును ఎలా కడుతారు.. తాము కోర్టులో కేసు వేశామని పార్లమెంట్‌లో అభ్యంతరం వ్యక్తం చేయగా అందుకు అరుణ్ జైట్లీ చెప్పిన సమాధానాన్ని కూడా ఉండవల్లి ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టును యాక్ట్‌లో పెట్టారు కాబట్టి తాను ఏమీ చేయలేమని… ఒకవేళ సుప్రీం కోర్టు ఆ యాక్ట్‌ను కొట్టివేస్తే అప్పుడు తాము కూడా పోలవరంపై వెనక్కు తగ్గుతామని అరుణ్ జైట్లీ చెప్పడం బట్టి ప్రాజెక్టు నిర్మాణంపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నోరువిప్పాలన్నారు. మోదీ చేసిన మోసానికి వ్యతిరేకంగా ఇకపై ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడికి వెళ్లి చంద్రబాబు ప్రచారం చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు.

Also Read:

త‌మ‌న్నా దృష్టి ఎప్పుడు దాని పైనే..!

డబ్బు కోసం నేను అలా చేయను…

సన్నీలియోన్ మనస్సు దోచుకున్న బాహుబలి

సెక్స్ అడిక్ట్‌గా అవ‌స‌రాల శ్రీనివాస్…

నా చావు నేను చ‌స్తా అంటున్న రాజ‌మౌళి!

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News