త‌మ‌న్నా దృష్టి ఎప్పుడు  దాని పైనే..! 

ప‌ట్టుద‌ల ఉంటే అనుకున్న‌ది సాధించవచ్చు అన‌డానికి  యంగ్ హీరోయిన్ త‌మ‌న్నా ఒక ఎగ్జాంపుల్ అనిపిస్తుంది.   శ్రీ అనే చిత్రంతో   తెలుగులో ఆమే ప‌రిచ‌యం అయిన‌ప్ప‌టికి.. ఇప్ప‌టికి త‌మ‌న్నాను చూస్తే  ఎవ‌రైన   వారెవ్వా త‌మ‌న్నా అనాల్సిందే.   మంచు మ‌నోజ్  తో చేసిన  శ్రీ  చిత్రం త‌మ‌న్నాకు పెద్ద‌గా క‌ల‌సి రాలేదు. ఆ త‌రువాత  శేఖ‌ర్ క‌మ్ముల తో చేసిన  హ్యాపిడేస్ చిత్రంతో మంచి పేరొచ్చింది. అయితే  ఆఫ‌ర్స్ మాత్రం వెంట‌నే రాలేదు. దీంతో   […]

Advertisement
Update:2016-08-03 07:47 IST
ప‌ట్టుద‌ల ఉంటే అనుకున్న‌ది సాధించవచ్చు అన‌డానికి యంగ్ హీరోయిన్ త‌మ‌న్నా ఒక ఎగ్జాంపుల్ అనిపిస్తుంది. శ్రీ అనే చిత్రంతో తెలుగులో ఆమే ప‌రిచ‌యం అయిన‌ప్ప‌టికి.. ఇప్ప‌టికి త‌మ‌న్నాను చూస్తే ఎవ‌రైన వారెవ్వా త‌మ‌న్నా అనాల్సిందే. మంచు మ‌నోజ్ తో చేసిన శ్రీ చిత్రం త‌మ‌న్నాకు పెద్ద‌గా క‌ల‌సి రాలేదు. ఆ త‌రువాత శేఖ‌ర్ క‌మ్ముల తో చేసిన హ్యాపిడేస్ చిత్రంతో మంచి పేరొచ్చింది. అయితే ఆఫ‌ర్స్ మాత్రం వెంట‌నే రాలేదు. దీంతో చెన్నై చెక్కిసి అక్క‌డ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ అయ్యింది.
అలా వ‌యా చెన్నై, 100% ల‌వ్ తో త‌న లో గ్లామ‌ర్, యాక్టింగ్ రెండిటిని ఆడియ‌న్స్ కు చూపించే రోల్ ద‌క్కింది. అక్క‌డ నుంచి వెనక్కు చూసుకోలేదు . స్టార్ హీరోస్ తో ఆఫ‌ర్స్ వ‌ర‌స క‌ట్టాయి. కానీ స‌క్సెస్ రేషియో మాత్రం త‌క్కువ గా రావ‌డంతో.. మ‌ళ్లీ టాలీవుడ్ లో డైలామాలో ప‌డింది. ఆల్మోస్ట్ త‌మ‌న్నా ఫేడ్ అవుట్ అనే సంద‌ర్భంలో రాజ‌మౌళితో చేసిన బాహుబ‌లి చిత్రం మళ్లీ త‌మ‌న్నాను బౌన్స్ బ్యాక్ చేసింది. దీంతో ప్ర‌స్తుం అయితే న‌టిగా ఫుల్ బిజీగా ఉంది.
క‌ట్ చేస్తే ప్ర‌స్తుతం కోన వెంక‌ట్ ప్రొడ‌క్ష‌న్స్ లో అభినేత్రి అనే ఒక త్రిభాష చిత్రం చేస్తుంది. కొరియో గ్ర‌ఫ‌ర్ ప్ర‌భుదేవ న‌టిస్తున్న ఈ చిత్రం ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో త‌మ‌న్నా స్టెప్స్ అద‌ర‌హో అనిపిస్తున్నాయి. సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. అయితే దానికి త‌మ‌న్నా మాత్రం అదంత త‌న గొప్ప‌త‌న‌ం కాదంటో్ంది …..ఈ రోజు నేను ఏం చేశానో, రేపు వేరొకరు అంతకంటే ఎక్కువ చేసి చూపిస్తారు. ఎవరో ఎందుకు? నేనే ఈ రోజుకి భిన్నంగా రేపు ఇంకేదైనా కొత్తగా చేసి చూపించాల్సిందే. నా దృష్టి ఎప్పుడూ ఆ విషయంపైనే ఉంటుంది తప్ప నిన్న చేసిన పని గురించి కాదు’’ అని చెబుతోంది తమన్నా. ప్రస్తుతం ఆమె ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’లో నటిస్తోంది.
Tags:    
Advertisement

Similar News