"ఇది రెండోసారి".. వైసీపీ ధర్నాలో జేసీ దివాకర్ రెడ్డి

ప్రత్యేక హోదా కోసం బుధవారం కూడా వైసీపీ ఎంపీలు సభలో, బయట ఆందోళన కొనసాగించారు. ఉదయం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైసీపీ సభ్యులు ధర్నా చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అటుగా వచ్చారు. టీడీపీ సభ్యుడైనప్పటికి వైసీపీ ఎంపీల వద్దకు వెళ్లి కాసేపు ముచ్చట్లు పెట్టారు. వైసీపీ ఎంపీలకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధులు ఫొటోలు తీసేందుకు ప్రయత్నించగా… […]

Advertisement
Update:2016-08-03 10:10 IST

ప్రత్యేక హోదా కోసం బుధవారం కూడా వైసీపీ ఎంపీలు సభలో, బయట ఆందోళన కొనసాగించారు. ఉదయం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైసీపీ సభ్యులు ధర్నా చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అటుగా వచ్చారు. టీడీపీ సభ్యుడైనప్పటికి వైసీపీ ఎంపీల వద్దకు వెళ్లి కాసేపు ముచ్చట్లు పెట్టారు. వైసీపీ ఎంపీలకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధులు ఫొటోలు తీసేందుకు ప్రయత్నించగా… ”తీసుకోండి” అంటూ ఫొటోలకు జేసీ పోజులు కూడా ఇచ్చారు. గతంలోనే వైఎస్‌ జగన్‌ కేంద్రమంత్రులను కలిసేందుకు ఢిల్లీ వచ్చిన సమయంలోనూ పార్లమెంట్ వద్దే జేసీ ఎదురుపడ్డారు. జగన్‌తో కరచాలనం చేసి కుశల ప్రశ్నలు వేశారు. జగన్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. జేసీ తీరు చూస్తుంటే… ఆయన టీడీపీలో ఉన్నా సర్వస్వతంత్రుడిగానే వ్యవహరిస్తున్నట్టుగా ఉంది. లేకుంటే టీడీపీ ఎంపీ అయి ఉండి అప్పుడు జగన్‌తో ఇప్పుడు వైసీపీ ఎంపీలతో ఫొటోలు దిగుతారా?. మరో టీడీపీ ఎంపీ అయితే ఇలా చేయగలరా?. చేసి బాబు ఆగ్రహాన్ని తట్టుకోగలరా?.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News