మరోసారి బయటపడ్డ చంద్రబాబు "హాట్‌ లైన్"...

ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని అరుణ్ జైట్లీ చెప్పిన వెంటనే ప్రెస్ మీట్‌ పెట్టిన చంద్రబాబు ”నా రక్తం మరుగుతోంది” అని గుడ్లు ఉరిమారు. ఆయన హావభావాలు చూసి  చంద్రబాబు బీజేపీని మసి చేసేస్తారేమోనని   అందరూ అనుకున్నారు. కానీ అదంతా పైకేనని తేలిపోయింది. మరోసారి చంద్రబాబు హాట్‌ లైన్ వ్యవహారం బయటపడింది. అప్పట్లో చిదంబరం ఆ విషయాన్ని బయటపెట్టగా ఇప్పుడు అరుణ్ జైట్లీ బాబు అసలు రూపాన్ని బయటపెట్టారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌ను ఏపీ […]

Advertisement
Update:2016-08-02 11:30 IST

ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని అరుణ్ జైట్లీ చెప్పిన వెంటనే ప్రెస్ మీట్‌ పెట్టిన చంద్రబాబు ”నా రక్తం మరుగుతోంది” అని గుడ్లు ఉరిమారు. ఆయన హావభావాలు చూసి చంద్రబాబు బీజేపీని మసి చేసేస్తారేమోనని అందరూ అనుకున్నారు. కానీ అదంతా పైకేనని తేలిపోయింది. మరోసారి చంద్రబాబు హాట్‌ లైన్ వ్యవహారం బయటపడింది. అప్పట్లో చిదంబరం ఆ విషయాన్ని బయటపెట్టగా ఇప్పుడు అరుణ్ జైట్లీ బాబు అసలు రూపాన్ని బయటపెట్టారు.

ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌ను ఏపీ ఎంపీలు పదేపదే అడ్డుకోవడం చూసిన అరుణ్ జైట్లీ కాసింత అసహనంగానే పైకి లేచారు. ”ఏపీకి సాయం చేయాలనే ఉన్నాం. ఈ విషయంపై చంద్రబాబుతో మాట్లాడాను” అని అరుణ్ జైట్లీ పార్లమెంట్‌ వేదికగా చెప్పారు. పరోక్షంగా ”మీ బాబుతో మాట్లాడాను… ఇక నాటకాలు ఆపేసి కూర్చోండి” అని టీడీపీ ఎంపీలకు సలహా ఇచ్చారు. ”చంద్రబాబుతో మాట్లాడాను” అనగానే టీడీపీ ఎంపీలు కూడా గప్‌ చుప్‌ అయిపోయి కూర్చుకున్నారు. అయితే అరుణ్ జైట్లీ చంద్రబాబుకు ఫోన్ చేసి ఏం మాట్లాడి ఉంటారన్న దానిపైనే ఇప్పుడు ఆసక్తి.

ఒకవేళ ఉడుకుతున్న చంద్రబాబు రక్తం చూసి కేంద్రం భయపడి ఉంటే ప్రత్యేక హోదాకు తాను అనుకూలమేనని చంద్రబాబుకు చెప్పి ఉండాలి. అదే జరిగి ఉంటే ఈ పాటికి చంద్రబాబు అండ్ అనుకూల మీడియా కేకలు, విజిల్స్‌ వేసి ”బాబు గెలిచారు, హోదా సాధించారు” అంటూ గంతులు వేసేది. అది జరగలేదు కాబట్టి ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు అరుణ్ జైట్లీ ఎలాంటి హామీ ఇవ్వలేదన్నది స్పష్టమవుతోంది. ఇక రెండో ఆప్షన్.. ఆర్థిక ప్యాకేజ్. ఒక వేళ ”ప్యాకేజ్ ఇస్తాం సర్దుకుపోండి” అని అరుణ్ జైట్లీ చెప్పి ఉంటే అందుకు చంద్రబాబు అంగీకరించారా?. ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజ్ ఈ రెండూ కాకుండా మరో దారిలో చంద్రబాబును అరుణ్ జైట్లీ దారికి తెచ్చారా?. ”చంద్రబాబుతో మాట్లాడాం” అని అరుణ్ జైట్లీ ప్రకటించిన తర్వాత కూడా చంద్రబాబు నుంచి ఎందుకు స్పందన లేదు?. అంటే హాట్‌ లైన్ ద్వారా చంద్రబాబును కేంద్ర పెద్దలు బెదిరించారా?.

2012 మే నెలలోనూ తెలంగాణకు తాము అనుకూలం అంటూ అప్పటి టీడీపీ ఎంపీ నామానాగేశ్వరరావు లోక్‌సభలో చొక్కాలు చించుకుంటుంటే అప్పటి హోంమంత్రి చిదంబరం కూడా చంద్రబాబు అసలు రంగు బయటపెట్టారు. ”మీ చంద్రబాబే వచ్చి నన్ను కలిశారు. ఏం చెప్పారో కూడా బయటపెట్టమంటారా” అని చిదంబరం ప్రశ్నించేసరికి ఆ రోజు కూడా టీడీపీ ఎంపీ మ్యావ్‌మంటూ నోటి మీద వేలేసుకుని కూర్చుకున్నారు. ఈరోజు కూడా అరుణ్ జైట్లీ లేచి చంద్రబాబుతో మాట్లాడాం అనగానే టీడీపీ ఎంపీలు సైలెంట్ అయిపోయారు. అంటే చంద్రబాబు మారలేదు. కేంద్రం వద్ద ఆయన వ్యక్తిగత హాట్ లైన్ పనిచేస్తూనే ఉంది. కాకపోతే ఆ హాట్‌ లైన్‌ మొత్తం రహస్యాల మయమైనట్టుగా ఉంది. అందుకే ”మీ బాబు మాకు టచ్‌లో ఉన్నారు” అని కేంద్రమంత్రులు చెబితే చాలు టీడీపీ ఎంపీలు తోక ముడిచేస్తున్నారు. చంద్రబాబు కూడా స్పందించడం లేదు. అది అప్పుడు ఇప్పుడు కూడా!.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News