నెలకే వైసీపీ తల్లిలాంటిదని తెలిసిందట...
టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ ఎమ్మెల్యేల స్థాయిలోనే కాకుండా జెడ్పీటీసీలు, ఎంపీపీల స్థాయిలోనూ నిర్వహిస్తోంది. అయితే లోకేష్ ఆధ్వర్యంలోని ఫిరాయింపు ప్రోత్సహక కమిటీ వలలో చిక్కుకున్న కింది స్థాయి నేతలు మాత్రం తిరిగి సొంతగూటికి వస్తున్నారు. ఇటీవల కడపలో కొందరు కార్పొరేటర్లను టీడీపీ చేర్చుకోగా మరుసటి రోజు ఒకాయన కన్నీళ్లు పెట్టుకుని వెనక్కు వచ్చేశారు. తాజాగా నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట జెడ్పీటీసీ సభ్యురాలు కూడా ఫిరాయింపు వలకు చిక్కి తిరిగి వెనక్కు వచ్చేశారు. జెడ్పీటీసీ హజరత్తమ్మ నెల క్రితం […]
టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ ఎమ్మెల్యేల స్థాయిలోనే కాకుండా జెడ్పీటీసీలు, ఎంపీపీల స్థాయిలోనూ నిర్వహిస్తోంది. అయితే లోకేష్ ఆధ్వర్యంలోని ఫిరాయింపు ప్రోత్సహక కమిటీ వలలో చిక్కుకున్న కింది స్థాయి నేతలు మాత్రం తిరిగి సొంతగూటికి వస్తున్నారు. ఇటీవల కడపలో కొందరు కార్పొరేటర్లను టీడీపీ చేర్చుకోగా మరుసటి రోజు ఒకాయన కన్నీళ్లు పెట్టుకుని వెనక్కు వచ్చేశారు. తాజాగా నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట జెడ్పీటీసీ సభ్యురాలు కూడా ఫిరాయింపు వలకు చిక్కి తిరిగి వెనక్కు వచ్చేశారు.
జెడ్పీటీసీ హజరత్తమ్మ నెల క్రితం టీడీపీలో చేరారు. అయితే పార్టీని వీడినందుకు ఈ నెల రోజుల పాటు మనోవేధనకు గురయ్యానని హజరత్తమ్మ చెబుతున్నారు. తల్లిలాంటి వైసీపీని వీడిపొరపాటు చేశానన్నారు. అధికార పార్టీలో ఉంటే ప్రజలకు సేవ చేయవచ్చని ఆ పార్టీ నాయకులు చెబితే వెళ్లానని, అయితే అక్కడ సేవచేసే పరిస్థితులు లేవన్నారు. తనను నమ్మి ఓట్లేసి గెలిపించిన ఓటర్ల ఆశలు వమ్ము చేయకూడదని నిర్ధారించుకుని తిరిగి సొంతగూటికి వచ్చినట్లు ఆమె చెప్పారు. హజరత్తమ్మకు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Click on Image to Read: