"జనతా"లో మోహన్‌లాల్ కు వేరే వ్యక్తితో డబ్బింగ్!
దక్షిణాదిలో విలక్షణమైన పాత్రలు పోషించే తారల్లో మోహన్‌లాల్ ది ప్రత్యేకశైలి. ఈయన ఏ భాషలో సినిమా చేసినా.. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటారు. ఇతరులు తన పాత్రకు మరెవరు డబ్బింగ్ చెబుతానంటే ఒప్పుకోరు. కానీ, తొలిసారిగా ఆయనకు అద్దె గొంతు వాడే పరిస్థితి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెలుగులో చేస్తోన్న జనతా గ్యారేజీ సినిమాలో మోహన్‌లాల్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. కానీ, రషెస్ చూశాక మోహన్‌లాల్ పాత్రకు […]
Advertisement
దక్షిణాదిలో విలక్షణమైన పాత్రలు పోషించే తారల్లో మోహన్‌లాల్ ది ప్రత్యేకశైలి. ఈయన ఏ భాషలో సినిమా చేసినా.. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటారు. ఇతరులు తన పాత్రకు మరెవరు డబ్బింగ్ చెబుతానంటే ఒప్పుకోరు. కానీ, తొలిసారిగా ఆయనకు అద్దె గొంతు వాడే పరిస్థితి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెలుగులో చేస్తోన్న జనతా గ్యారేజీ సినిమాలో మోహన్‌లాల్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. కానీ, రషెస్ చూశాక మోహన్‌లాల్ పాత్రకు డబ్బింగ్ సరిగా రాలేదని దర్శకుడు కొరటాల అభిప్రాయపడ్డాడట. అందుకే, మోహన్‌లాల్ పాత్రకు డబ్బింగ్ మరో వ్యక్తితో చెప్పించాలని నిర్ణయించాడట. ఈ విషయాన్ని మోహన్‌లాల్‌కి చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడట. కానీ, ఈ ప్రతిపాదనకు మోహన్ లాల్ ససేమీరా అన్నాడని సమాచారం.
ఆగస్టు 5న విడుదల కానున్న ”మనమంతా” సినిమాలోనూ మోహన్‌లాల్ కీలకపాత్రలో నటించారు. ఆయన పాత్రకు ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారు. కానీ, దృష్టి, సంతృప్తి లాంటి పదాలు వచ్చేచోట ఆయన కాస్త తడబడ్డారు. సరిగ్గా కొరటాల శివ కూడా ఇవే పదాల వద్ద అభ్యంతరం చెప్పాడనిపిస్తోంది. ఇలాంటి పదాలు ఆయనకు సంతృప్తి నిచ్చినా.. సీరియస్ సీన్లలో ఉచ్ఛారణ దోషం కారణంగా ఆ సీన్ తీవ్రత తగ్గిపోతుందన్నది కొరటాల అభిప్రాయంగా తెలుస్తోంది. మరి మోహన్‌లాల్ ఇందుకు ఒప్పుకుంటాడా? లేదా అన్నది త్వరలోనే తేలనుంది.
వాస్తవానికి మోహన్‌లాల్ తెరపై తన పాత్రకు మరొకరు డబ్బింగ్ చెప్పడం ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించిన కంపెనీ సినిమాలోనూ తాను వేసిన పోలీసాఫీసరు పాత్రకూ హిందిలో స్వయంగా డబ్బింగ్ చెప్పారు. ఆయన వేసింది ముంబై పోలీసు కమిషనర్ వేషం. ఐఏఎస్, ఐపీఎస్‌లంతా తాము పని చేస్తున్నచోట వచ్చీరాని భాషలోనే మాట్లాడతారు. కాబట్టి, అక్కడ ఆయన వాడిన వచ్చీరాని హిందీ భాష పాత్రకు పూర్తి న్యాయం చేసింది. మరి ఇక్కడ ఆయన వేసేది సీరియస్ గా ఉండే పెద్దమనిషి పాత్ర. ఇక్కడ జనాలు ఆయన స్లాంగ్‌ని అంగీకరిస్తారా? లేదా? అన్నది వేచి చూడాలి!
Advertisement