ఢిల్లీలో నాకేం పని ఉంది? " ప్రెస్‌మీట్‌లో బాబు కీలక వ్యాఖ్యలు

ప్రత్యేకహోదాపై అరుణ్‌ జైట్లీ ప్రకటన తర్వాత రాష్ట్రంలో ప్రజలు ఆగ్రహంగా ఉండడంతో  ఏం చేయాలన్న దానిపై చంద్రబాబు తన పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఎంపీల సమావేశంలో బీభత్సమైన నిర్ణయం తీసుకుంటారని అందరూ ఆశించారు. కానీ ఎప్పటిలాగే మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు ఒత్తిడి గీతం ఆలపించారు. ఒత్తిడి తెద్దాం… పోరాడి సాధించుకుద్దామంటూ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం చేపట్టిన బంద్‌నుకూడా తప్పుపట్టారు. బంద్‌లు చేస్తే( గతంలో బాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ప్రతిదానికి బంద్‌ అనేవారు) సమస్య పరిష్కారం అవుతుందా […]

Advertisement
Update:2016-07-31 09:30 IST

ప్రత్యేకహోదాపై అరుణ్‌ జైట్లీ ప్రకటన తర్వాత రాష్ట్రంలో ప్రజలు ఆగ్రహంగా ఉండడంతో ఏం చేయాలన్న దానిపై చంద్రబాబు తన పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఎంపీల సమావేశంలో బీభత్సమైన నిర్ణయం తీసుకుంటారని అందరూ ఆశించారు. కానీ ఎప్పటిలాగే మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు ఒత్తిడి గీతం ఆలపించారు. ఒత్తిడి తెద్దాం… పోరాడి సాధించుకుద్దామంటూ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం చేపట్టిన బంద్‌నుకూడా తప్పుపట్టారు. బంద్‌లు చేస్తే( గతంలో బాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ప్రతిదానికి బంద్‌ అనేవారు) సమస్య పరిష్కారం అవుతుందా అని ప్రశ్నించారు. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తే ఏం వస్తుందని ప్రశ్నించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు బంద్‌లు అవసరం లేదని… రోడ్లు ఊడ్చి నిరసన తెలిపితే సరిపోతుందని సెలవిచ్చారు బాబు.

ఢిల్లీ వెళ్లి ఒత్తిడి తెస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ”ఢిల్లీకి నేనెందుకు వెళ్తా.. అక్కడ నాకేం పని ఉంది. ఎంపీలున్నారు కదా!. ఇక్కడ నాకు చాలా పనులున్నాయి” అని వ్యాఖ్యానించారు. ఎంపీలు వెళ్లి ప్రధానిని కలుస్తారన్నారు. ఇప్పటికే తాను 25సార్లు ఢిల్లీ వెళ్లివచ్చానన్నారు. మీ ఒత్తిడే పనిచేయనప్పుడు ఎంపీల మాట ప్రధాని వింటారా అని ప్రశ్నించగా చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఆవేశానికి లోనైతే సమస్య పక్కదారిపడుతుందని చెప్పారు. తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని.. ప్రజలే తనకు హైకమాండ్ అని చెప్పారు. ఒత్తిడి పెంచడమే మనవద్ద ఉన్న శక్తివంతమైన ఆయుధం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఒకవేళ ఎంపీలు కలిసిన తర్వాత కూడా మోదీ నుంచి సరైన స్పందన లేకుంటే అప్పుడు భవిష్యత్తు కార్యాచరణపై ఆలోచిస్తామన్నారు. అప్పులు తెచ్చుకుందామంటే చట్టాలు అడ్డుగా ఉన్నాయన్నారు. రాష్ట్రానికి గుడ్‌ విల్ ఉండాలనే సురేష్ ప్రభుకు రాజ్యసభ ఇచ్చామన్నారు. ఏపీ ఒక పసిపాప అని… దాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై లేదా అని ప్రశ్నించారు చంద్రబాబు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News