బస్సులు తగలబెడుతారేమోనని భయంగా ఉంది " అంబటి

ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును వైసీపీ అధికార ప్రతినిధి అంబటిరాంబాబు తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్రం ఇంత అన్యాయం చేస్తుంటే మోదీ చంక నుంచి చంద్రబాబు ఎందుకు దిగడంలేదని ప్రశ్నించారు. ఒకవైపు కేంద్రంలో భాగస్వామిగానే ఉంటూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం విచిత్రంగా ఉందన్నారు. అరుణ్‌ జైట్లీ చెప్పిన ప్రతిమాటలోనూ టీడీపీ కూడా భాగస్వామి అన్న విషయాన్ని చంద్రబాబుకు ఎందుకు దాస్తున్నారని అంబటి ప్రశ్నించారు. రెండు గంటల పాటు ప్రధాని అపాయింట్ మెంట్ ఇస్తే సమస్య మొత్తం పరిష్కారం […]

Advertisement
Update:2016-07-31 11:21 IST

ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును వైసీపీ అధికార ప్రతినిధి అంబటిరాంబాబు తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్రం ఇంత అన్యాయం చేస్తుంటే మోదీ చంక నుంచి చంద్రబాబు ఎందుకు దిగడంలేదని ప్రశ్నించారు. ఒకవైపు కేంద్రంలో భాగస్వామిగానే ఉంటూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం విచిత్రంగా ఉందన్నారు. అరుణ్‌ జైట్లీ చెప్పిన ప్రతిమాటలోనూ టీడీపీ కూడా భాగస్వామి అన్న విషయాన్ని చంద్రబాబుకు ఎందుకు దాస్తున్నారని అంబటి ప్రశ్నించారు. రెండు గంటల పాటు ప్రధాని అపాయింట్ మెంట్ ఇస్తే సమస్య మొత్తం పరిష్కారం అవుతుందని చంద్రబాబు చెప్పడాన్ని అంబటి తప్పుపట్టారు. రెండేళ్లు గడుస్తున్నా రెండు గంటల పాటు ప్రధానితో అపాయింట్మెంట్ సాధించలేని చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఎక్కడుందని ప్రశ్నించారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేపదే బంద్‌లకు పిలుపునిచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం బంద్‌ల వల్ల ఒరిగేదేమీ ఉండదని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పైగా జపాన్ తరహాలో రోడ్లు ఊడ్చి నిరసన తెలపాలని చంద్రబాబు చెప్పడం దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. చివరకు పోరాటాల తీరును కూడా జపాన్‌ నుంచి దిగుమతి చేసుకునే స్థాయికి చంద్రబాబు ఎందుకు దిగజారారో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు స్వాతంత్య్రానికి ముందు పుట్టి ఉంటే బ్రిటిష్ వాళ్లకే మద్దతు పలికేవాడని అంబటి ఎద్దేవా చేశారు. పోరాటాలు చేసేందుకు ప్రపంచం మొత్తం గాంధీని ఆదర్శంగా తీసుకుంటుంటే చంద్రబాబు మాత్రం జపాన్‌ వెంట పడడం సిగ్గుచేటన్నారు. వైసీపీ బంద్‌లో బస్సులు తగలబెడితే ఎవరూ బాధ్యత వహిస్తారంటూ చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించడంపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటలు బట్టి చూస్తుంటే చంద్రబాబే మనుషులను పంపించి బస్సులను తగలబెట్టిస్తారేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. అలా చేయడం ద్వారా ఉద్యమకారులపై నిందలు వేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టుగా ఉందని… తునిలోనూ ఇదే తరహాలో చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే ఆగస్ట్‌ 2న ప్రభుత్వమే అధికారికంగా బంద్‌ నిర్వహించాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News