మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దయాశంకర్ సింగ్ అరెస్టు!
బీఎస్‌పి అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బహిష్కృత బిజెపి నాయకుడు దయాశంకర్ సింగ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర ప్రదేశ్, బీహార్ పోలీసులు కలిసి బీహార్‌లోని బక్సర్‌లో ఆయనను అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. బీఎస్‌పి కార్యకర్తలు చేసిన ఫిర్యాదు మేరకు దయాశంకర్ సింగ్‌పై ఎస్సి ఎస్‌టి చట్టం ప్రకారం కేసు నమోదు కాగా, ఆయన ఇన్నాళ్లూ పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. మాయావతి టిక్కెట్లను ఎక్కువ డబ్బు ఇచ్చిన వారికే ఇస్తూ… గంటల వ్యవధిలోనే మార్చేసి […]
బీఎస్పి అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బహిష్కృత బిజెపి నాయకుడు దయాశంకర్ సింగ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర ప్రదేశ్, బీహార్ పోలీసులు కలిసి బీహార్‌లోని బక్సర్‌లో ఆయనను అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. బీఎస్‌పి కార్యకర్తలు చేసిన ఫిర్యాదు మేరకు దయాశంకర్ సింగ్‌పై ఎస్సి ఎస్‌టి చట్టం ప్రకారం కేసు నమోదు కాగా, ఆయన ఇన్నాళ్లూ పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. మాయావతి టిక్కెట్లను ఎక్కువ డబ్బు ఇచ్చిన వారికే ఇస్తూ… గంటల వ్యవధిలోనే మార్చేసి అమ్ముతున్నారని, ఆమె ఒక వేశ్యలా ప్రవర్తిస్తున్నారని… దయాశంకర్ వ్యాఖ్యానించడం తెలిసిందే. ఆ తరువాత ఆయన తన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతూ…ఆమె టిక్కెట్లను అమ్మడం మాత్రం నిజమేనన్నారు. సింగ్ మాటలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపటంతో బిజెపి ఆయనను ఆరు సంవత్సరాల పాటు పార్టీనుండి బహిష్కరించింది.