మధుయాష్కిపై వార్తలకు నేను బలయ్యా...

సింగర్ సునీత ఒక ఇంటర్వ్యూలో అనేక అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ఒక రాజకీయ నాయకుడితో ఎఫైర్ ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు. ఆమె ఏమన్నారంటే… ”మధుయాష్కీతో ఎవరికి శత్రుత్వం ఉందో నాకు తెలీదు కానీ దానికి నేను బలయ్యాను. ఓ బ్యూటిఫుల్‌ సింగర్‌తో ఆయనకేదో ఉందని వార్తలు రాయడం మొదలుపెట్టారు. ఉన్న బ్యూటిఫుల్‌ సింగర్స్‌లో నేనూ  ఒకదాన్ని కావడంతో చాలామంది నా పేరు ఫిక్స్‌ చేసేశారు. అదెంత అన్యాయమో చెప్పండి. నా పక్కన ఓ స్ట్రాంగ్‌ పర్సన్‌ […]

Advertisement
Update:2016-07-25 16:16 IST

సింగర్ సునీత ఒక ఇంటర్వ్యూలో అనేక అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ఒక రాజకీయ నాయకుడితో ఎఫైర్ ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు. ఆమె ఏమన్నారంటే… ”మధుయాష్కీతో ఎవరికి శత్రుత్వం ఉందో నాకు తెలీదు కానీ దానికి నేను బలయ్యాను. ఓ బ్యూటిఫుల్‌ సింగర్‌తో ఆయనకేదో ఉందని వార్తలు రాయడం మొదలుపెట్టారు. ఉన్న బ్యూటిఫుల్‌ సింగర్స్‌లో నేనూ ఒకదాన్ని కావడంతో చాలామంది నా పేరు ఫిక్స్‌ చేసేశారు. అదెంత అన్యాయమో చెప్పండి. నా పక్కన ఓ స్ట్రాంగ్‌ పర్సన్‌ ఉండి ఉంటే ఇలాంటి రూమర్స్‌ వస్తాయా? లేకపోవడంతో ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు అన్నట్లయిపోయింది. భర్త ఎలా ఉన్నా సర్దుకుపోయి ఉంటే సునీత గ్రేట్‌ అని గొప్పగా మాట్లాడుకునేవారు.లింకప్‌ రూమర్స్‌ కూడా వచ్చి ఉండేవి కావు.

నన్ను ఎమోషనల్‌గా టార్చర్‌ చేసిన వాళ్లు చాలామంది ఉన్నారు. నా పర్సనల్‌ లైఫ్‌లో వచ్చిన సమస్యల కారణంగా చాలా అవకాశాలు తగ్గాయి. ఆ తర్వాత వాళ్లంతట వాళ్లే తెలుసుకుని “మేం తప్పు చేశాం… సారీ” అని చెప్పి అవకాశం ఇస్తున్నారు. నాతో పరిచయం లేనివాళ్లు నా గురించి ఏవేవో మాట్లాడతారు. పరిచయం అయ్యాక “మీరింత మంచి మనిషి అనుకోలేదు” అంటారని వెల్లడించారు. పిల్లలు, స్నేహితులు అంతా తనను అర్ధం చేసుకునేవారేనని చెప్పారు. కాబట్టి మరో పెళ్లి అవసరం తనకు కనిపించలేదు. సునీత ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటూ తన భర్త అప్పులు చేశారని ఆరోపించారు. తాను ఒక్క రూపాయి కూడా అప్పు చేసే వ్యక్తిని కాదన్నారు. ఉంటే తింటా లేకుంటే లేదన్నారు. తన దృష్టిలో భార్యాపిల్లల గురించి పట్టని వ్యక్తి క్యారెక్టర్‌లెస్‌ ఫెలో అని సునీత వ్యాఖ్యానించారు.

Click on Image to Read:

 

 

 

Tags:    
Advertisement

Similar News