చంద్రబాబు కరెంట్ సీక్రెట్ ఇదీ బాబూ...

తాను ముఖ్యమంత్రి అవగానే పదిరోజుల్లోనే ఏపీలో విద్యుత్ సమస్యను పరిష్కరించానని చంద్రబాబు ప్రతి మీటింగ్‌లో చెబుతుంటారు. అమాయకజనం నిజమే అనుకుని నమ్ముతారని ఆయన భావన అయి ఉండవచ్చు. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ సమస్య దాదాపు తీరింది. దీని వెనుక అసలు కారణం తెలియని వారు అదంతా బాబు మహిమేనని నమ్ముతుంటారు. అయితే విద్యుత్ కొరత ఎలా తీరిందన్న  విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరోసారి వివరించారు. గత ప్రభుత్వహయాంలోనే దేశంలో […]

Advertisement
Update:2016-07-13 09:32 IST

తాను ముఖ్యమంత్రి అవగానే పదిరోజుల్లోనే ఏపీలో విద్యుత్ సమస్యను పరిష్కరించానని చంద్రబాబు ప్రతి మీటింగ్‌లో చెబుతుంటారు. అమాయకజనం నిజమే అనుకుని నమ్ముతారని ఆయన భావన అయి ఉండవచ్చు. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ సమస్య దాదాపు తీరింది. దీని వెనుక అసలు కారణం తెలియని వారు అదంతా బాబు మహిమేనని నమ్ముతుంటారు. అయితే విద్యుత్ కొరత ఎలా తీరిందన్న విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరోసారి వివరించారు.

గత ప్రభుత్వహయాంలోనే దేశంలో అనేక థర్మల్ ప్లాంట్లను స్థాపించారు. అయితే అప్పట్లో అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు, చమురు ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో అనేక విద్యుత్ ప్లాంట్‌లు పూర్తి సామర్థ్యంతో పనిచేయలేదు. మూడేళ్లుగా అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు, చమురు ధరలు భారీగా ఊహించని రీతిలో పతనమయ్యాయి. దీంతో విదేశాల నుంచి కూడా బొగ్గును భారీగా దిగుమతి చేసుకుంటూ మొత్తం దేశంలోని అన్ని ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దీని వల్లే దేశం మొత్తం మీద విద్యుత్ కోతలు లేకుండాపోయాయి.

మూడేళ్ల క్రితం తమిళనాడులో 12 గంటల పాటు కోతలుండేవని ఇప్పుడు అక్కడ కూడా లోటు లేకుండా పోయిందని బుగ్గన చెప్పారు. కాబట్టి ఏపీలో 24 గంటల విద్యుత్ తన గొప్పతనమేనని చంద్రబాబు ప్రచారం చేసుకోవడం బాగోలేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తప్లాంట్లు కట్టి విద్యుత్ కొరతను నివారించినట్టు బిల్డప్ ఇవ్వడం చంద్రబాబుకు తగదన్నారు. ప్రస్తుతం మరో పదేళ్ల వరకు ఇప్పటి విద్యుత్ ప్లాంట్లు సరిపోతాయని చెప్పారు. అయినప్పటికీ చంద్రబాబు తన వారికి లబ్ది చేకూర్చేందుకు ఎక్సెస్‌ మొత్తంతో విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తున్నారని బుగ్గన విమర్శించారు. వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. ప్రతిదానిలోనూ చంద్రబాబు పట్టిసీమ సిద్దాంతాన్నే ఫాలో అవుతున్నారని విమర్శించారు.

Click on Image to Read –

Tags:    
Advertisement

Similar News