టీడీపీ లేకుండా బీజేపీ మనగలదా?
2019లో తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం.. టీఆర్ ఎస్‌తో పొత్తు ప్రసక్తే ఉండదు.. వినేందుకు కొంచెం హాస్యంగా ఉన్నా ఈ మాటలు అన్నది ఆపార్టీ నేతలే! రాష్ట్రంలో టీఆర్ ఎస్ తో హనీమూన్ ముగిసింది. ఇక ప్రజాసమస్యలపై పోరు ఉద్ధృతం చేస్తాం. తెలంగాణలో ప్రధానప్రతిపక్షంగా అవతరిస్తాం అంటూ ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. 2019లోగా ప్రజాసమస్యలపై పోరాడుతాం. వచ్చేసారి అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని కైవసం […]
Advertisement
2019లో తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం.. టీఆర్ ఎస్‌తో పొత్తు ప్రసక్తే ఉండదు.. వినేందుకు కొంచెం హాస్యంగా ఉన్నా ఈ మాటలు అన్నది ఆపార్టీ నేతలే! రాష్ట్రంలో టీఆర్ ఎస్ తో హనీమూన్ ముగిసింది. ఇక ప్రజాసమస్యలపై పోరు ఉద్ధృతం చేస్తాం. తెలంగాణలో ప్రధానప్రతిపక్షంగా అవతరిస్తాం అంటూ ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. 2019లోగా ప్రజాసమస్యలపై పోరాడుతాం. వచ్చేసారి అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకుంటాం అని వెల్లడించారు.
అయితే, ఈమాటలు విన్న గులాబీ నేతలు పగలబడి నవ్వుతున్నారు. అస్సలు తెలంగాణలో బీజేపీ గెలుస్తున్నదే టీడీపీ దయవల్ల అని ఆరోపిస్తున్నారు. నగరంలో టీడీపీతో పొత్తు లేకుండా ఒక్కసీటైనా గెలవగలరా? అని సవాలు విసురుతున్నారు. తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో ప్రజలంతా కోరినా.. రాజీనామా చేయకుండా అప్పటి పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వెన్నుచూపిన మాట వాస్తవం కాదా? అని గుర్తు చేస్తున్నారు. తిరిగి గెలవలేమన్న భయంతోనే ఆయన రాజీనామా విషయంలో వెనకడుగు వేశారని ఆరోపిస్తున్నారు. కేవలం నగరానికి మాత్రమే పరిమితమైన మీ పార్టీ… తెలంగాణ వ్యాప్తంగా మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలనుకోవడం పగటికలలే అని విమర్శిస్తున్నారు. గ్రామాల్లో, మండలాల్లో సరైన కేడర్ లేకుండా ఇదంతా ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు.
కేవలం పత్రికల్లో, మీడియాలో పతాక శీర్షికల్లో నిలవడానికే ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసిందేంటి? అని గులాబీ నేతలు నిలదీస్తున్నారు. కమలనాథులు తెలంగాణ రాష్ర్టంపై సవతి ప్రేమ కనబరుస్తోన్న విషయాన్ని ఇక్కడి ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. టీడీపీ తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయిందని.. వారి ఓట్లను నమ్ముకుని ఇలాంటి ప్రకటనలు చేయడం కాలయాపనే అవుతుందని హెచ్చరించారు.
Advertisement