కరీంనగర్‌లో మనసులో మాట బయటపెట్టిన టీజీ!
అది కరీంనగర్ నగరం.. ఉద్యమాల పురిటిగడ్డగా ఈ ప్రాంతానికి పేరు. తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా సాగిన ప్రాంతం. అలాంటి చరిత్ర కలిగిన ఈ నగరంలో కరుడు గట్టిన సమైక్యాంధ్ర ఉద్యమనేత టీజీ వెంకటేశ్ కు సన్మానం జరిగింది. అది మామూలుగా కాదు.. అత్యంత అట్టహాసంగా..! అదే వేదికపై తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన నేతలూ ఉన్నారు. రెండు పరస్పర విరుద్ధ భావాలున్న నాయకులను ఒక్కటి చేసింది కరీంనగర్. వివరాలు.. కరీంనగర్‌లో ఆర్యవైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) తృతీయ […]
Advertisement
అది కరీంనగర్ నగరం.. ఉద్యమాల పురిటిగడ్డగా ఈ ప్రాంతానికి పేరు. తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా సాగిన ప్రాంతం. అలాంటి చరిత్ర కలిగిన ఈ నగరంలో కరుడు గట్టిన సమైక్యాంధ్ర ఉద్యమనేత టీజీ వెంకటేశ్ కు సన్మానం జరిగింది. అది మామూలుగా కాదు.. అత్యంత అట్టహాసంగా..! అదే వేదికపై తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన నేతలూ ఉన్నారు. రెండు పరస్పర విరుద్ధ భావాలున్న నాయకులను ఒక్కటి చేసింది కరీంనగర్. వివరాలు.. కరీంనగర్‌లో ఆర్యవైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) తృతీయ మహాసభలు జరిగాయి. ఈ వేడుకలకు టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమానికి దీటుగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజాలకెత్తుకున్న టీజీ వెంకటేశ్ ఈ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా వెంకటేశ్ తన మనసులో మాటను బయటపెట్టారు. ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ విడిపోతే.. తమ పరిస్థితి ఏంటి? ఆందోళన అప్పుడు అధికంగా ఉండేదన్నారు. ఈ ప్రాంతం ఏపీ నుంచి విడిపోవడం ఇష్టంలేకనే తాను సమైక్యాంధ్ర ఉద్యమం చేపట్టినట్లు వివరించారు. కానీ, రాష్ర్టాలు విడిపోయాక తెలుగు ప్రజలంతా సోదరభావంతో కలిసి ఉండటం తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు. టీజీ వెంకటేశ్ ప్రసంగిస్తున్నంత సేపు సభాప్రాంగణం హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. అనంతరం టీజీని భారీ పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మరో ప్రత్యేకత ఏంటంటే.. ఉద్యమసమయంలో పరస్పర సవాళ్లు విసుకురుకున్న ఈటెల రాజేందర్ – టీజీ వెంకటేశ్‌లకు కలిపి సన్మానం, ఒకేపూలమాల వేయడం కొసమెరుపు.
Advertisement