టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్సీ
వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఆయన రెండుమూడురోజుల్లో ప్రకటన చేస్తారని చెబుతున్నారు. దీనిపై తన అనుచరులకు కూడా ఆయన సమచారం ఇచ్చారని తెలుస్తోంది. 2013లో ఆదిరెడ్డి అప్పారావు వైసీపీ నుంచి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. పార్టీలో గట్టి పోటీ ఉన్నప్పటికీ ఆదిరెడ్డి అప్పారావుకు జగన్ అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్సీ అయిన సమయంలో తనను ఎమ్మెల్సీని చేసిన జగన్‌ను సీఎం చేసేంతవరకు కృషి చేస్తూనే ఉంటానని అప్పారావు చెప్పారు. వైసీపీకి […]
వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఆయన రెండుమూడురోజుల్లో ప్రకటన చేస్తారని చెబుతున్నారు. దీనిపై తన అనుచరులకు కూడా ఆయన సమచారం ఇచ్చారని తెలుస్తోంది. 2013లో ఆదిరెడ్డి అప్పారావు వైసీపీ నుంచి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. పార్టీలో గట్టి పోటీ ఉన్నప్పటికీ ఆదిరెడ్డి అప్పారావుకు జగన్ అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్సీ అయిన సమయంలో తనను ఎమ్మెల్సీని చేసిన జగన్‌ను సీఎం చేసేంతవరకు కృషి చేస్తూనే ఉంటానని అప్పారావు చెప్పారు. వైసీపీకి హ్యాండిచ్చి వెళ్తున్న చాలా మంది నేతల మూలాలు టీడీపీలో ఉన్నాయి. ఆదిరెడ్డి కూడా టీడీపీ వ్యక్తే. 18ఏళ్లు ఆ పార్టీలో ఉన్నారు. అనంతరం వైసీపీలోకి రావడంతో అతడి మంచి ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్సీని చేశారు జగన్. ఇప్పుడు జగన్ తీరు తనకు నచ్చలేదంటూ ఆయన పార్టీ వీడేందుకు సిద్ధమవడం గమనార్హం.
click on image to read-