వైఎస్ జయంతికి అన్నదానం చేసిన ఫిరాయింపు ఎమ్మెల్సీ

వైఎస్‌ను చెడ్డవాడిగా చూపేట్టేందుకు చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నాయకులు, టీడీపీ అనుకూల మీడియా చేయని ప్రయత్నం లేదు. అలాంటి పార్టీలో ఉంటూ వైఎస్ గొప్పవారని చెప్పడం సాధ్యమా?. అంతటితో ఆగకుండా ఏకంగా వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించగలగడమా ?  టీడీపీలో ఉంటూ అంత సాహసం చేయడం దాదాపు అసాధ్యమే. కానీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరుడు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మాత్రం ఆ పనిచేశారు. తన సొంతూరు దేవగుడిలో వైఎస్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వైఎస్ విగ్రహానికి […]

Advertisement
Update:2016-07-08 11:31 IST

వైఎస్‌ను చెడ్డవాడిగా చూపేట్టేందుకు చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నాయకులు, టీడీపీ అనుకూల మీడియా చేయని ప్రయత్నం లేదు. అలాంటి పార్టీలో ఉంటూ వైఎస్ గొప్పవారని చెప్పడం సాధ్యమా?. అంతటితో ఆగకుండా ఏకంగా వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించగలగడమా ? టీడీపీలో ఉంటూ అంత సాహసం చేయడం దాదాపు అసాధ్యమే. కానీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరుడు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మాత్రం ఆ పనిచేశారు. తన సొంతూరు దేవగుడిలో వైఎస్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతేకాదు ఏకంగా భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు నారాయణరెడ్డి. ఇలా చేయడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వైసీపీ తరపున ఎమ్మెల్సీగా గెలిచి.. తీరా ఆ పార్టీని వదిలేసి .. నిత్యం వైఎస్‌ను దూషించే టీడీపీలో చేరి అక్కడ తిరిగి వైఎస్‌ జయంతికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆసక్తికరంగానే ఉంది. ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కొన్ని నెలల క్రితమే సోదరుడు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో కలిసి టీడీపీలో చేరారు. టీడీపీలో ఉంటూ వైఎస్ జయంతిని నిర్వహించిన ఏకైక నేత బహుశా ఎమ్మెల్సీ నారాయణరెడ్డే. ఈవిషయం తెలిస్తే చంద్రబాబు తట్టుకోగలరా?.

click on image to read-

Tags:    
Advertisement

Similar News