మిలీనియం టౌన్‌షిప్‌ను ముట్టడించిన ఎన్‌ఐఏ, సాయుధ బలగాలు

హైదరాబాద్ స‌మీపంలోని షాద్ న‌గ‌ర్‌లో ఉగ్రకలకలం రేగింది. జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ) పోలీసుల‌కు, ఉగ్రవాదులకు మ‌ధ్య కాల్పులు జ‌రుగుతున్నాయి.  సోమ‌వారం ఉద‌యం న‌గ‌ర‌శివార్ల‌లో ఉన్న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా షాద్ న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలోని మిలీనియం టౌన్‌షిప్‌లో ఉగ్ర‌వాద సానుభూతి ప‌రుడు భాషా ఇంటికి ఎన్ ఐఏ ముట్టడించింది. బాషా ఇంటిలో ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో ఎన్ఐఏ, సాయుధబలగాలు అక్కడికి వెళ్లాయి. భద్రతా దళాలు సోదాలు చేస్తుండగానే  ఉగ్రవాదులు భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారు. ఎన్ఐఏ జరిపిన ఎదురు […]

Advertisement
Update:2016-07-08 04:55 IST

హైదరాబాద్ స‌మీపంలోని షాద్ న‌గ‌ర్‌లో ఉగ్రకలకలం రేగింది. జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ) పోలీసుల‌కు, ఉగ్రవాదులకు మ‌ధ్య కాల్పులు జ‌రుగుతున్నాయి. సోమ‌వారం ఉద‌యం న‌గ‌ర‌శివార్ల‌లో ఉన్న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా షాద్ న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలోని మిలీనియం టౌన్‌షిప్‌లో ఉగ్ర‌వాద సానుభూతి ప‌రుడు భాషా ఇంటికి ఎన్ ఐఏ ముట్టడించింది. బాషా ఇంటిలో ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో ఎన్ఐఏ, సాయుధబలగాలు అక్కడికి వెళ్లాయి. భద్రతా దళాలు సోదాలు చేస్తుండగానే ఉగ్రవాదులు భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారు. ఎన్ఐఏ జరిపిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్టు సమాచారం.

లోప‌ల ఎంత‌మంది ఉన్నారు. వారి వ‌ద్ద ఎలాంటి మార‌ణాయుధాలు ఉన్నాయ‌న్న‌దానిపై స్ప‌ష్ట‌త లేదు. దీంతో కిలో మీటర్ మేర చుట్టుపక్కల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఎన్ కౌంటర్ జరుగుతున్న ప్రదేశానికి మరింత మంది పోలీసులను రప్పిస్తున్నారు. ప్ర‌ధాని స‌భ జ‌రిగిన మ‌రునాడే ఉగ్ర‌వాద‌కాల్పులు జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల న‌గ‌రంలో భారీ పేలుళ్ల కుట్ర‌ను ఎన్ ఐ ఏ పోలీసులు భగ్నం చేసిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో అదుపులోకి తీసుకున్న తీవ్ర‌వాద సానుభూతి ప‌రులు ఇచ్చిన స‌మాచారం మేర‌కే ఈ దాడులు జ‌రిగాయ‌ని స‌మాచారం. కాల్పుల మోత‌తో మిలీనియం టౌన్‌షిప్‌లో ఉన్న నివాసితులు తీవ్ర భ‌య‌కంపితుల‌వుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News