బాబు ఇలాకాలో మళ్లీ పగుళ్లు

చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌ అవినీతిలో నెంబర్ వన్‌లో ఉందని ఇటీవల నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లయిడ్‌ ఎకనమిక్‌ రిసెర్చ్‌ తేల్చిచెప్పింది. అలా తేల్చడం ఎవరినీ పెద్దగా ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే ఏపీలో వ్యవహారాలు అలాగే ఉన్నాయి. ప్రతిచోట తమ్ముళ్లు తొడకొట్టి నిధులు జేబుల్లోకి తోసేస్తున్నారు. అంతా నాసికరమే. తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో ఫ్లోర్ కుంగడం కలకలం రేపింది. తాజాగా తమ్ముళ్ల అవినీతి కృష్ణాపుష్కరాల్లో ప్రవహిస్తోంది. పుష్కర పనుల్లో నాణ్యత గాలికొదిలేశారు. ఇందుకు విజయవాడలో నిర్మిస్తున్న మహాఘాటే నిదర్శనం. విజయవాడలో […]

Advertisement
Update:2016-07-08 06:16 IST

చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌ అవినీతిలో నెంబర్ వన్‌లో ఉందని ఇటీవల నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లయిడ్‌ ఎకనమిక్‌ రిసెర్చ్‌ తేల్చిచెప్పింది. అలా తేల్చడం ఎవరినీ పెద్దగా ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే ఏపీలో వ్యవహారాలు అలాగే ఉన్నాయి. ప్రతిచోట తమ్ముళ్లు తొడకొట్టి నిధులు జేబుల్లోకి తోసేస్తున్నారు. అంతా నాసికరమే. తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో ఫ్లోర్ కుంగడం కలకలం రేపింది. తాజాగా తమ్ముళ్ల అవినీతి కృష్ణాపుష్కరాల్లో ప్రవహిస్తోంది.

పుష్కర పనుల్లో నాణ్యత గాలికొదిలేశారు. ఇందుకు విజయవాడలో నిర్మిస్తున్న మహాఘాటే నిదర్శనం. విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ దిగువన కనకదుర్గ వారధి సమీపంలో మహాఘాట్‌ నిర్మిస్తున్నారు. అయితే అది ఇంకా నిర్మాణంలో ఉండగానే కాంక్రీట్ బిడ్ నిట్టనిలువుగా చీలిపోయింది. ఇక్కడ మరోవిశేషం ఏమిటంటే. దాన్ని సరిచేసేయోచనలో కాంట్రాక్టర్లు ఉన్నట్టుగా లేదు. భారీ పగుళ్లు ఎవరికీ కనిపించకుండా గోనెసంచెలు కప్పేశారు. మళ్లీ కాంక్రీట్ బిడ్ నిర్మించాలంటే పెద్ద తతంగం అవుతుంది కాబట్టి… పగుళ్ల మీదే టైల్స్ వేసి రంగులేసేందుకు సిద్ధమవుతున్నారు.

విజయవాడలో మహాఘాట్ పరిస్థితే ఇలా ఉంటే ఇక మిగిలిన పనుల్లో నాణ్యత ఎంతవరకు ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పుష్కరాలకు 1500 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఈ నిధుల్లో భారీ అవినీతి జరుగుతోదంటూ గురువారం టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంగ్ల పత్రిక కూడా ప్రముఖంగా కథనాన్నిప్రచురించింది. అందుకు బలాన్ని చేకూరుస్తూ నిర్మాణంలో ఉండగానే కాంక్రీట్ బిడ్‌లు పగిలిపోతున్నాయి.

Tags:    
Advertisement

Similar News