వైసీపీలో చేరిన చంద్రప్రసాద్... వరుపులకు ప్రత్యామ్నాయమేనా?
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పర్వత పూర్ణ చంద్రప్రసాద్ వైసీపీలో చేరారు. జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పర్వతపూర్ణతో పాటు పీసీపీ అధికార ప్రతినిధి కుమార్ రాజు, పలువురు నేతలు పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో పూర్ణ చంద్రప్రసాద్ కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ప్రత్తిపాడు నియోజవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో ప్రత్తిపాడులో వైసీపీ నుంచి వరుపుల సుబ్బారావు విజయం సాధించారు. కొన్ని నెలల క్రితమే తన బంధువు జ్యోతుల […]
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పర్వత పూర్ణ చంద్రప్రసాద్ వైసీపీలో చేరారు. జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పర్వతపూర్ణతో పాటు పీసీపీ అధికార ప్రతినిధి కుమార్ రాజు, పలువురు నేతలు పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో పూర్ణ చంద్రప్రసాద్ కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ప్రత్తిపాడు నియోజవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో ప్రత్తిపాడులో వైసీపీ నుంచి వరుపుల సుబ్బారావు విజయం సాధించారు. కొన్ని నెలల క్రితమే తన బంధువు జ్యోతుల నెహ్రుతో కలిసి వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించారు. ఈనేపథ్యంలో పర్వత పూర్ణ చంద్రప్రసాద్ వైసీపీలో చేరడం చర్చనీయాంశమైంది. ఆయనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారో లేదో చూడాలి.
Click on Image to Read: