రోడ్లు ఉన్నది నడవడానికి... అప్పట్లోనే నేనొక రూల్ తెచ్చా...

విజయవాడలో హిందూ ఆలయాల కూల్చివేతను ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్ధించుకున్నారు. రోడ్లు ఉన్నది ప్రజలు నడవడానికి, వాహనాలు వెళ్లడానికి అని అన్నారు. గతంలోనే తాను ఒక రూల్ తీసుకొచ్చానని చెప్పారు. రోడ్ల వద్ద గుళ్లుగానీ, మసీదులు గానీ, విగ్రహాలు గానీ కట్టకూడదన్న నిబంధన తెచ్చామన్నారు. కానీ దాన్ని ఇష్టానుసారం ఉల్లంఘించి విజయవాడలో ఆలయాలను కట్టారని చంద్రబాబు చెప్పారు. బీజేపీతో పాటు తమ పార్టీ నేతలు కూడా  తొందరపడరాదని….రోడెక్కి మాట్లాడితే ప్రజల్లో అపోహలు పెరిగిపోతాయన్నారు. రోడ్లు వెడల్పు చేయకపోతే ఇబ్బందిపడేది ప్రజలేనని అన్నారు. […]

Advertisement
Update:2016-07-04 08:43 IST

విజయవాడలో హిందూ ఆలయాల కూల్చివేతను ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్ధించుకున్నారు. రోడ్లు ఉన్నది ప్రజలు నడవడానికి, వాహనాలు వెళ్లడానికి అని అన్నారు. గతంలోనే తాను ఒక రూల్ తీసుకొచ్చానని చెప్పారు. రోడ్ల వద్ద గుళ్లుగానీ, మసీదులు గానీ, విగ్రహాలు గానీ కట్టకూడదన్న నిబంధన తెచ్చామన్నారు. కానీ దాన్ని ఇష్టానుసారం ఉల్లంఘించి విజయవాడలో ఆలయాలను కట్టారని చంద్రబాబు చెప్పారు. బీజేపీతో పాటు తమ పార్టీ నేతలు కూడా తొందరపడరాదని….రోడెక్కి మాట్లాడితే ప్రజల్లో అపోహలు పెరిగిపోతాయన్నారు.

రోడ్లు వెడల్పు చేయకపోతే ఇబ్బందిపడేది ప్రజలేనని అన్నారు. అవసరమైతే కొన్ని ఆలయాలను రీలొకేట్ చేస్తామన్నారు. ఆలయాల కూల్చివేత శాస్త్ర ప్రకారం జరగాల్సిందని కానీ అది జరగలేదని చంద్రబాబు చెప్పారు. అయితే ఇటీవల నిబంధనలు ఉల్లంఘించి ఆలయాలు కట్టారన్న చంద్రబాబు మాటల్లో నిజం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం కూల్చిన ఆలయాల్లో అతిపూరాతనమైనవి కూడా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. కేవలం గుళ్లను కూల్చిన స్థలాన్నిఇతరులకు అప్పగించేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఆలయాలపై దండెత్తిందని అంటున్నారు.

మరోవైపు వెలగపూడిలోని సచివాలయ నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించారు. వర్షాల వల్ల పనులు కొంచెం ఆలస్యమయ్యాయని చెప్పారు. ఇబ్బందులు ఉన్నా ఉద్యోగులు సర్దుకుపోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం తనకు అనుకూలమైన అంశాలను మాత్రమే తెరపైకి తెచ్చి వివాదం చేయడం సరికాదని హైకోర్టు విభజనను దృష్టిలోపెట్టుకుని చంద్రబాబు అన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News