ఆ ఇద్దరితో పెట్టుకున్నారు... బాబు ప్రభుత్వానికి గండమే
విజయవాడలో 40 ఆలయాలను చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేయించడంపై హిందూపీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 1903నాటి ఆంజనేయుడి విగ్రహం కూల్చివేయడం ఏమిటని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి మండిపడ్డారు. అర్జునుడి కాలం నాటి వినాయకుడి విగ్రహం కూల్చివేయడం అపచారమన్నారు. రాహు, కేతువుల ఆలయాలను కూడా కూల్చివేశారని ఆవేదన చెందారు. రాహుకేతువులతో పెట్టుకున్నారని అది ప్రభుత్వానికే గండమని శివస్వామి అభిప్రాయపడ్డారు. ఆలయాల కూల్చివేతకు నిరసనగా సోమవారం విజయవాడలో భారీర్యాలీ నిర్వహిస్తామన్నారు. పూర్వకాలం మహ్మదీయ రాజులు దేశంపై దండెత్తి వేల ఆలయాలను నేలమట్టం […]
విజయవాడలో 40 ఆలయాలను చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేయించడంపై హిందూపీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 1903నాటి ఆంజనేయుడి విగ్రహం కూల్చివేయడం ఏమిటని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి మండిపడ్డారు. అర్జునుడి కాలం నాటి వినాయకుడి విగ్రహం కూల్చివేయడం అపచారమన్నారు. రాహు, కేతువుల ఆలయాలను కూడా కూల్చివేశారని ఆవేదన చెందారు.
రాహుకేతువులతో పెట్టుకున్నారని అది ప్రభుత్వానికే గండమని శివస్వామి అభిప్రాయపడ్డారు. ఆలయాల కూల్చివేతకు నిరసనగా సోమవారం విజయవాడలో భారీర్యాలీ నిర్వహిస్తామన్నారు. పూర్వకాలం మహ్మదీయ రాజులు దేశంపై దండెత్తి వేల ఆలయాలను నేలమట్టం చేశారని… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే పనిచేసిందన్నారు. ఎవరికీ చెప్పకుండా ఆర్థరాత్రి మద్యం సేవించిన వారిని తీసుకెళ్లి ఆలయాలను కూల్చివేశారంటే ఇంతకంటే అపచారం మరొకటి ఉండదని శైవక్షేత్రం పిఠాధిపతి శివస్వామి అన్నారు.
Click on Image to Read: