జగన్ పవర్‌ ప్లాంట్‌ ఖరీదు అన్ని వేల కోట్లా?

 వైఎస్‌ను అవినీతిపరుడిగా చిత్రీకరించేందుకు టీడీపీ వాళ్లు ఎన్నికల ముందు లక్ష కోట్ల అవినీతి అంటూ పుస్తకాలు ముద్రించారు. అయితే లేనిపోని లెక్కలు వేసి లక్ష కోట్ల మార్కుకు తీసుకెళ్లామని అప్పట్లో సదరు పుస్తక రచనలో  కీలక పాత్ర పోషించిన,ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఒక సీనియర్ నేత చెప్పారు. ఎన్నిసార్లు లెక్కలేసినా పెద్దగా స్కోర్ పెరగలేదని అందుకే అన్ని పెంచేసి లక్ష కోట్ల అవినీతి అంటూ చంద్రబాబు ఆదేశాలతోనే పుస్తకం ముద్రించామని ఒక సందర్భంలో చెప్పారాయన. బహుశా […]

Advertisement
Update:2016-07-02 15:49 IST

వైఎస్‌ను అవినీతిపరుడిగా చిత్రీకరించేందుకు టీడీపీ వాళ్లు ఎన్నికల ముందు లక్ష కోట్ల అవినీతి అంటూ పుస్తకాలు ముద్రించారు. అయితే లేనిపోని లెక్కలు వేసి లక్ష కోట్ల మార్కుకు తీసుకెళ్లామని అప్పట్లో సదరు పుస్తక రచనలో కీలక పాత్ర పోషించిన,ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఒక సీనియర్ నేత చెప్పారు. ఎన్నిసార్లు లెక్కలేసినా పెద్దగా స్కోర్ పెరగలేదని అందుకే అన్ని పెంచేసి లక్ష కోట్ల అవినీతి అంటూ చంద్రబాబు ఆదేశాలతోనే పుస్తకం ముద్రించామని ఒక సందర్భంలో చెప్పారాయన. బహుశా ఇప్పుడు కూడా అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారో ఏమో గానీ జగన్ ఆస్తుల గురించి సోమిరెడ్డి కొత్త విషయం చెప్పారు.

ఇంటిని కూడా ఈడీ అటాచ్‌ చేసిన నేపథ్యంలో నైతిక విలువలుంటే జగన్ వెంటనే పార్టీని మూసివేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. కోర్టుల్లో నిర్దోషిగా తేలిన తర్వాత తిరిగి పార్టీని ప్రారంభించాలన్నారు. జగన్‌కు వేల కోట్ల ఆస్తులున్నాయని ఆరోపించారు. ఒక్క పవర్ ప్రాజెక్ట్ విలువే రూ.60వేల కోట్లు చేస్తుందని సోమిరెడ్డి వెల్లడించారు. తొమ్మిది లక్షల ఆదాయం నుంచి ఇప్పుడు దేశంలోనే భారీగా టాక్స్ చెల్లిస్తున్న వ్యక్తి స్థాయికి జగన్‌ ఎలా ఎదిగారో చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. అయితే ఒక్క పవర్ ప్లాంటే రూ. 60 వేల కోట్లు చేస్తుందని చెప్పడం నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉంది. జగన్ దగ్గర నిజంగా అంత డబ్బు ఉందో లేదో గానీ… ఇలా టీడీపీ నేతలు జగన్ వద్ద వేల కోట్లు ఉన్నాయని చెప్పడం ద్వారా తమ పార్టీకి ఆర్థిక కష్టాలు లేవన్న ధైర్యాన్ని వైసీపీ శ్రేణుల్లో కలిగిస్తున్నట్టుగా ఉంది.

అయినా ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపుల్లో దొరికిన వ్యక్తులు రాష్ట్రాలను ఏలుతున్నప్పుడు, బ్యాంకులకు వందల కోట్లు ఎగొట్టిన వారు కేంద్ర మంత్రులుగా పనిచేస్తునప్పుడు… కేసుల వ్యవహారం కోర్టుల్లో ఉన్న జగన్‌ మాత్రమే పార్టీ మూసేయాలని సోమిరెడ్డి చెప్పడం టీడీపీ విధానంలో ఒక భాగం అయి ఉండవచ్చు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News