విరాళాలకోసం లండన్ కి పవన్ ?
ఓవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఆ సినిమా సంగతి అటుంచితే పవన్ మాత్రం ప్రస్తుతం సూట్ కేసు సర్దుకుంటున్నాడు. లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అక్కడ తన ఫ్యాన్స్ ను అలరించబోతున్నాడు పవన్. అక్కడి తెలుగువాళ్లు ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమానికి పవన్ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నాడు. దీనికోసం వచ్చేనెల 9న పవన్ ఫ్లైట్ ఎక్కనున్నాడు. యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్ – […]
;ఓవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఆ సినిమా సంగతి అటుంచితే పవన్ మాత్రం ప్రస్తుతం సూట్ కేసు సర్దుకుంటున్నాడు. లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అక్కడ తన ఫ్యాన్స్ ను అలరించబోతున్నాడు పవన్. అక్కడి తెలుగువాళ్లు ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమానికి పవన్ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నాడు. దీనికోసం వచ్చేనెల 9న పవన్ ఫ్లైట్ ఎక్కనున్నాడు. యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్ – యూకేటీఏ పేరుతో అక్కడ ఓ పెద్ద అసోసియేషన్ ఉంది. ఆ సంఘం వార్షికోత్సవ కార్యక్రమానికి పవన్ ప్రత్యేక అతిధిగా హాజరుకాబోతున్నాడు. ఈ ఈవెంట్ లో పవన్ ఆట పాటలతో అభిమానులకు సందడి చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కు హాజరవ్వాలంటే 30 యూరోలుగా టికెట్ ధరను నిర్ణయించారు. ఛారిటీ కోసం ఎక్కువగా ఖర్చుపెట్టిన వాళ్లకు.. పవన్ తో భోజనం చేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు.
నిజానికి పవన్ ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటాడు. కానీ పవన్ లండన్ వెళ్లి మరీ అక్కడ కార్యక్రమంలో పాల్గొనడానికి ఓ బలమైన కారణం ఉందని అంటున్నారు.. త్వరలోనే సినిమాలు వదిలేసి, రాజకీయాల్లోకి దూకాలనుకుంటున్న పవన్… తన జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు నిధులు సేకరించే క్రమంలో… లండన్ లో జరిగే కార్యక్రమానికి హాజరవుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం ఎలా ఉన్నప్పటికీ… పవన్ లండన్ కార్యక్రమం వల్ల కొత్త సినిమా షూటింగ్ కాస్త ఆలస్యమౌతోంది. పవన్ లండన్ నుంచి తిరిగొచ్చిన తర్వాతే… పొలాచ్చిలో కడప కింగ్ షూటింగ్ మొదలవుతుంది. డాలీని ఈ సినిమాకు దర్శకుడిగా సెలక్ట్ చేసిన విషయం తెలిసిందే.
Click on Image to Read: