హైకోర్టు జడ్జీలపై బార్ అసోసియేషన్ అధ్యక్షుడి సంచలన ఆరోపణలు

కొద్దిరోజులుగా ఆప్షన్లకు వ్యతిరేకంగా, ప్రత్యేక హైకోర్టు కోసం తెలంగాణ న్యాయవాదులు ఆందోళనబాట పట్టారు. ఇందులో భాగంగా ఆదివారం తెలంగాణ న్యాయాధికారులు చలో రాజ్‌భవన్ నిర్వహించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఇద్దరు న్యాయమూర్తులపై సస్పెన్షన్‌ వేటు వేసింది. న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు రవీందర్‌ రెడ్డి, కార్యదర్శి వరప్రసాద్‌పై వేటు వేసింది. దీనిపై న్యాయాధికారులు, టీ లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టులో ఆందోళనకు దిగారు. ఈసందర్భంగా ఒక తెలుగు టీవీ ఛానల్‌తో మాట్లాడిన హైకోర్టు బార్‌ […]

Advertisement
Update:2016-06-27 10:45 IST

కొద్దిరోజులుగా ఆప్షన్లకు వ్యతిరేకంగా, ప్రత్యేక హైకోర్టు కోసం తెలంగాణ న్యాయవాదులు ఆందోళనబాట పట్టారు. ఇందులో భాగంగా ఆదివారం తెలంగాణ న్యాయాధికారులు చలో రాజ్‌భవన్ నిర్వహించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఇద్దరు న్యాయమూర్తులపై సస్పెన్షన్‌ వేటు వేసింది. న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు రవీందర్‌ రెడ్డి, కార్యదర్శి వరప్రసాద్‌పై వేటు వేసింది. దీనిపై న్యాయాధికారులు, టీ లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టులో ఆందోళనకు దిగారు. ఈసందర్భంగా ఒక తెలుగు టీవీ ఛానల్‌తో మాట్లాడిన హైకోర్టు బార్‌ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ రావు తీవ్రంగా స్పందించారు.

ఉద్యమాన్ని అణచివేసేందుకు కుట్రజరుగుతోందని ఆరోపించారు. సుప్రీంకోర్టులో ఉన్న ఇద్దరు ఆంధ్రా న్యాయమూర్తుల కనుసన్నల్లో ప్రస్తుత తాత్కాలిక సీజే పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో 18 మంది ఆంధ్రా న్యాయమూర్తులుండగా… తెలంగాణకు చెందిన వారు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారని మోహన్ రావు అన్నారు. భవిష్యత్తులో తన ఎదుగుదలకు సాయం చేస్తారన్న ఉద్దేశంతోనే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టులోని ఇద్దరు ఆంధ్రా న్యాయమూర్తుల కన్నుసన్నల్లో పనిచేస్తున్నారన్నారు.

ప్రస్తుత సీజేను వెంటనే బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత తాత్కాలిక సీజే కర్నాటకలో పనిచేసినప్పుడు ఈయన పనితీరు నచ్చక అక్కడి లాయర్లు కనీసం ఫేర్‌వెల్ పార్టీ కూడా ఇవ్వలేదని మోహన్‌ రావు చెప్పారు. న్యాయదేవతకు తాత్కాలిక సీజే గంతలు కట్టారని మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్తామన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేప్రసక్తే లేదన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News