బయటపడ్డ బాబు రెండు తలల సిద్దాంతం

బొగ్గు కొనుగోళ్ల నుంచి రాజధాని భూముల వరకు అనేక కుంభకోణాలు జరిగాయన్నది ప్రతిపక్ష వైసీపీతోపాటు ఇతర ప్రతిపక్షాల ఆరోపణ. కుంభకోణాల వెనుక చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌దే కీలక పాత్ర అని విపక్ష నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. వీటిపై సీబీఐ విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు..కానీ వీటికి చంద్రబాబు అండ్ గ్యాంగ్ చెబుతున్న సమాధానం ఒక్కటే. సీబీఐ ఎంటరైతే రాష్ట్ర ఇమేజ్ దెబ్బతింటుందట. అందుకే సీబీఐ విచారణ జరిపించబోం… మీరే అవినీతిని నిరూపించండి అని […]

Advertisement
Update:2016-06-12 04:24 IST

బొగ్గు కొనుగోళ్ల నుంచి రాజధాని భూముల వరకు అనేక కుంభకోణాలు జరిగాయన్నది ప్రతిపక్ష వైసీపీతోపాటు ఇతర ప్రతిపక్షాల ఆరోపణ. కుంభకోణాల వెనుక చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌దే కీలక పాత్ర అని విపక్ష నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. వీటిపై సీబీఐ విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు..కానీ వీటికి చంద్రబాబు అండ్ గ్యాంగ్ చెబుతున్న సమాధానం ఒక్కటే. సీబీఐ ఎంటరైతే రాష్ట్ర ఇమేజ్ దెబ్బతింటుందట. అందుకే సీబీఐ విచారణ జరిపించబోం… మీరే అవినీతిని నిరూపించండి అని చరిత్రలో చూడని వితండవాదాన్ని తెరపైకి తెచ్చింది ప్రభుత్వం.

రాజధానిలో వేలకోట్ల కుంభకోణాలు జరిగాయని, సీబీఐ విచారణ జరిపించాలని అందరూ మొత్తుకుంటున్నా చంద్రబాబు మాత్రం అమరావతి బ్రాండ్ పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. సీబీఐ రాష్ట్రంలో అడుగుపెడితే స్టేట్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని చెబుతున్న చంద్రబాబు అండ్ గ్యాంగ్ … తుని విధ్వంసంపై మాత్రం సీబీఐ విచారణకు మేం సై మీరు సైయ్యా అని సవాల్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో సీబీఐ విచారణ జరిపిస్తే ఏపీలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయన్న సందేశం దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లదా?. శాంతిభద్రతలు లేని చోట విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తాయా?.

బొగ్గు కొనుగోళ్లు, అమరావతి తదితర అంశాల్లో సీబీఐ విచారణకు అడ్డొచ్చిన బ్రాండ్ ఇమేజ్‌… తుని ఘటనలో మాత్రం అడ్డురాలేదెందుకో?. అంతేలే… అమరావతి భూదందా, బొగ్గు కొనుగోళ్లపై సీబీఐ రంగంలోకి దిగితే ఈజీగా ఆధారాలు దొరికిపోతాయి…. బాబు అండ్ సన్‌ రంగు బయటపడిపోతుంది. తుని ఘటనలో ఎలాగో టీడీపీ నేతలు నేరుగా లేరు కాబట్టి పోతే అక్కడికి వచ్చిన కాపులే పోతారు. రెండు నాలుకల సిద్ధాంతం, రెండు చిప్పల సిద్ధాంతం, రెండు కళ్ల సిద్ధాంతం, ఇప్పుడు రెండు తలల సిద్ధాంతం.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News