వాసిరెడ్డి పద్మ దెబ్బకు నోరెళ్లబెట్టిన టీవీ5

చంద్రబాబు పాలనపై టీవీ5 చేసిన సర్వేపై చర్చాకార్యక్రమం నిర్వహించారు. చర్చలో సీనియర్ జర్నలిస్ట్ ప్రసాద్ రెడ్డి, వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ, కాంగ్రెస్ నేత కొండపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. టీవీ5 సర్వేపై ఊహించని విధంగా చర్చలో పాల్గొన్న వారు స్పందించారు. వాసిరెడ్డి పద్మ నేరుగా సర్వే నిజాయితీనే ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, డ్వాక్రారుణమాఫీ, రాజధాని రైతుల పరిస్థితిపై ప్రశ్నలు అడగకుండా సర్వే ఫలితాలను ఎలా ప్రచురిస్తారని ప్రశ్నించారు. ఈ సర్వే చూస్తుంటే తనకు నవ్వొస్తోందని అన్నారు. మీడియాను […]

Advertisement
Update:2016-06-08 03:31 IST

చంద్రబాబు పాలనపై టీవీ5 చేసిన సర్వేపై చర్చాకార్యక్రమం నిర్వహించారు. చర్చలో సీనియర్ జర్నలిస్ట్ ప్రసాద్ రెడ్డి, వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ, కాంగ్రెస్ నేత కొండపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. టీవీ5 సర్వేపై ఊహించని విధంగా చర్చలో పాల్గొన్న వారు స్పందించారు. వాసిరెడ్డి పద్మ నేరుగా సర్వే నిజాయితీనే ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, డ్వాక్రారుణమాఫీ, రాజధాని రైతుల పరిస్థితిపై ప్రశ్నలు అడగకుండా సర్వే ఫలితాలను ఎలా ప్రచురిస్తారని ప్రశ్నించారు. ఈ సర్వే చూస్తుంటే తనకు నవ్వొస్తోందని అన్నారు. మీడియాను చంద్రబాబు బెదిరించి పనులు చేయించుకుంటున్నారని ఆరోపించారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్‌ను చంద్రబాబు ఎలా తీసివేయించారో అందరికీ తెలుసన్నారు. ఈ నేపథ్యంలో ఈ సర్వేను ఎలా విశ్వసించాలని ప్రశ్నించారు. అడగాల్సిన ప్రశ్నలను సర్వే అడక్కుండా చంద్రబాబు పాలన బాగుందని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

కాంగ్రెస్ నేత కొండపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇలాంటి సర్వేలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. రైతు రుణమాఫీ ప్రశ్నే లేకుండా సర్వే చేయడం ఏమిటిని ప్రశ్నించారు. టీడీపీకి ఇబ్బంది కలిగించే ప్రశ్నలే ఈ సర్వేలో లేవని విమర్శించారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో చేసింది చాలా తక్కువని ప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News