ఆదాయంలో లింగాల మండలం ముందుండడం ఆశ్చర్యంగా ఉంది... తాగుడు మానేస్తే పిచ్చివాళ్లవుతారు, పిల్లలను కనండి...

తననుతాను ప్రమోట్ చేసుకోవడంలో చంద్రబాబు రూటే సపరేట్‌గా ఉంది. ఐటీకి సంబంధించి ప్రపంచంలో ఏ మార్పు వచ్చినా దానికి మూలకారణం తానేనని చెప్పే చంద్రబాబు ఇప్పుడు సత్యనాదెండ్లను కూడా వదిలిపెట్టలేదు. తాను ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు ఐటీని ప్రోత్సహించడం వల్లే నేడు సత్యనాదెండ్ల మైక్రోసాప్ట్‌కు సీఈవో కాగలిగారని చెప్పారు. సత్యనాదెండ్లకు స్ఫూర్తి నింపింది తానేనని చెప్పుకున్నారు. ఈ వ్యాఖ్యలు విని సభకు వచ్చిన వారు బిక్కముఖాలేశారు. అంతే కాదు తాగుడు గురించి కూడా చంద్రబాబు మాట్లాడారు. తమ […]

Advertisement
Update:2016-06-05 06:55 IST

తననుతాను ప్రమోట్ చేసుకోవడంలో చంద్రబాబు రూటే సపరేట్‌గా ఉంది. ఐటీకి సంబంధించి ప్రపంచంలో ఏ మార్పు వచ్చినా దానికి మూలకారణం తానేనని చెప్పే చంద్రబాబు ఇప్పుడు సత్యనాదెండ్లను కూడా వదిలిపెట్టలేదు. తాను ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు ఐటీని ప్రోత్సహించడం వల్లే నేడు సత్యనాదెండ్ల మైక్రోసాప్ట్‌కు సీఈవో కాగలిగారని చెప్పారు. సత్యనాదెండ్లకు స్ఫూర్తి నింపింది తానేనని చెప్పుకున్నారు. ఈ వ్యాఖ్యలు విని సభకు వచ్చిన వారు బిక్కముఖాలేశారు.

అంతే కాదు తాగుడు గురించి కూడా చంద్రబాబు మాట్లాడారు. తమ మగాళ్లు తాగుడుకు బాసిసలయ్యారని మద్యాన్ని నిర్మూలించాలని ఒక మహిళ కోరగా… తాగుడు మాన్పిస్తే జనం పిచ్చివాళ్లవుతారని చంద్రబాబు చెప్పారు. దీంతో సదరు మహిళ అవాక్కయింది. వెంటనే తేరుకున్న చంద్రబాబు… మద్యాన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా మాన్పించాలని చెప్పారు. తలసరి ఆదాయంలో పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం ముందుండడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. అక్కడ అరటి పంట సాగు వల్లే ఇది సాధ్యమయిందని చెప్పారు.

రాష్ట్రంలో జనాభా తగ్గుతోందని …కాబట్టి ఎక్కువ మంది పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. లేకుంటే భవిష్యత్తులో రోబోలతో మీటింగ్‌లు పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. విజయవాడలో నవనిర్మాణ వారోత్సవాల్లో భాగంగా ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News