సుమిత్రా మహాజన్‌కి... అరకోటి కారు!
లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కి అత్యంత విలాసవంతమైన జాగుర్ ఎక్స్ ఇ స్పోర్ట్స్ కారుని కేటాయించడంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. అరకోటి వరకు విలువ చేసే ఈ కారుని భద్రతా కారణాల దృష్ట్యా ఆమెకు కేటాయించినట్టుగా తెలుస్తోంది. సోమవారం ఈ కారు ఆమె ఇంటికి చేరుతుంది. స్పీకర్‌కి… ఈ స్థాయి వరకే వాహనాన్ని ఇవ్వాలనే నిబంధనేమీ లేకపోయినా దీనిపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలే చేస్తోంది. ఆమెకి మంచి రోజులు వచ్చాయి…అయినా సరే ఆమె మరొకసారి […]
లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కి అత్యంత విలాసవంతమైన జాగుర్ ఎక్స్ ఇ స్పోర్ట్స్ కారుని కేటాయించడంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. అరకోటి వరకు విలువ చేసే ఈ కారుని భద్రతా కారణాల దృష్ట్యా ఆమెకు కేటాయించినట్టుగా తెలుస్తోంది. సోమవారం ఈ కారు ఆమె ఇంటికి చేరుతుంది. స్పీకర్‌కి… ఈ స్థాయి వరకే వాహనాన్ని ఇవ్వాలనే నిబంధనేమీ లేకపోయినా దీనిపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలే చేస్తోంది. ఆమెకి మంచి రోజులు వచ్చాయి…అయినా సరే ఆమె మరొకసారి తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ అన్నారు.
అయితే ప్రస్తుతం సుమిత్రా మహాజన్ వాడుతున్న కారు అయిదేళ్ల నాటిదని, కనుక ఆమె వాహనాన్ని మార్చటం సమంజసమేనని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. స్పీకర్ రక్షణ సైతం అత్యంత ముఖ్యమైన అంశమేనని, ప్రొటోకాల్ పరంగా చూస్తే స్పీకర్ భారత ప్రధాన న్యాయమూర్తితో సమానమని… రాష్ట్రపతి తరువాత ఆరవ స్థానంలో ఉంటారని…. ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉప ప్రధాని తరువాత స్థానం స్పీకర్ దేనని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.