విజయ్ కాంత్ పార్టీ గుర్తింపు రద్దు.. తమిళ విలేకరుల సంబరాలు!
అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అంటూ విజయ్ కాంత్ పై జోకులు వేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు తమిళనాడు విలేకరులు. ఇంతకీ ఎందుకంటారా? జయలలిత గెలిచినందుకో.. కరుణానిధి ఓడినందుకో కాదు.. మరి ఇంకెందుకు అనే కదా మీ ప్రశ్న. వారి సంబరానికి కారణం ఏంటంటే..? ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే! ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఏ రాష్ట్ర అసెంబ్లీకైనా పోటీ చేసిన పార్టీ కనీసం 6 […]
Advertisement
అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అంటూ విజయ్ కాంత్ పై జోకులు వేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు తమిళనాడు విలేకరులు. ఇంతకీ ఎందుకంటారా? జయలలిత గెలిచినందుకో.. కరుణానిధి ఓడినందుకో కాదు.. మరి ఇంకెందుకు అనే కదా మీ ప్రశ్న. వారి సంబరానికి కారణం ఏంటంటే..? ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే! ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఏ రాష్ట్ర అసెంబ్లీకైనా పోటీ చేసిన పార్టీ కనీసం 6 శాతం ఓట్లు సాధించాలి. కానీ, విజయ్‌కాంత్ పార్టీకి ఈ ఎన్నికల్లో కేవలం 2.4 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. నిబంధనల మేరకు ఓట్లు సాధించకపోవడంతో ఎన్నికల సంఘం ఆయన పార్టీ గుర్తింపు రద్దు చేసింది. దీంతో ఒకప్పుడు తమిళనాడులో 28 మంది ఎమ్మెల్యేలకు కెప్టెన్ గా వ్యవహరించిన విజయ్ కాంత్ పార్టీ లో ఒక్కసారిగా నైరాశ్యం అలుముకుంది. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లయింది విజయ్‌కాంత్ పరిస్థితి.
కాండ్రించి ఉమ్మేసినందుకే..!
ఆదివారం విజయ్ కాంత్ చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ఆ సందర్బంలో ఓ విలేకరి 2016లో జరిగే ఎన్నికల్లో జయలలిత మళ్లీ అధికారంలోకి వస్తారా? అని ప్రశ్నించారు. ఆ సమయంలో విజయ్ కాంత్ సావధానంగానే బదులిచ్చారు. అన్నా డీఎంకే మళ్లీ అధికారం చేపట్టడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. తరువాత రెండు మూడు ప్రశ్నలకు జవాబిచ్చారు. అంతలోనే విజయ్ కాంత్ కు పూనకం వచ్చింది. మీడియా సభ్యుల మీద విరుచుకుపడ్డారు. మీకు జయలలితను ప్రశ్నించే దమ్ము ఉందా? విలేకలరుపై గయ్యిమంటూ లేచాడు. మీకు భయం, మీరు జర్నలిస్టులేనా? యాక్.. థూ.. అంటూ వారి మీద ఉమ్మేశారు. అలా వారితో దురుసుగా ప్రవర్తించిన తరువాత ఆయన ప్రవర్తన ఏమాత్రం మారలేదు. గతంలోనూ పలువురిపై చేయిచేసుకున్నాడు. తానే సీఎం అయిపోతానంటూ… ముక్కుసూటిగా పోయాడు. ఎవరు స్నేహ హస్తం చాచినా అందుకోలేదు. ఇప్పుడు తన పార్టీ పూర్తిగా ఓడిపోయి గుర్తింపు రద్దవడంతో బొక్కబోర్లా పడ్డాడు. అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అంటూపాటలు పాడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. టెలివిజన్లు, పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో విజయ్‌కాంత్‌పై సెటైర్లతో చెలరేగిపోతున్నారు.
Advertisement